సచిన్, ధోనిలకు నో ప్లేస్.. | Virat Kohli captain, no place from Sachin Tendulkar or MS Dhoni | Sakshi
Sakshi News home page

సచిన్, ధోనిలకు నో ప్లేస్..

May 20 2017 7:09 PM | Updated on Sep 5 2017 11:36 AM

సచిన్, ధోనిలకు నో ప్లేస్..

సచిన్, ధోనిలకు నో ప్లేస్..

భారత క్రికెట్ జట్టు మాజీ బౌలర్ అజిత్ అగార్కర్ ప్రకటించిన ఆల్ టైమ్ ఐపీఎల్ ఎలెవన్ జట్టులో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తో పాటు మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనిలకు చోటు దక్కలేదు.

న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు మాజీ బౌలర్ అజిత్ అగార్కర్ ప్రకటించిన ఆల్ టైమ్ ఐపీఎల్ ఎలెవన్ జట్టులో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తో పాటు మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనిలకు చోటు దక్కలేదు. ఇదిలా ఉంచితే అజిత్ అగార్కర్ విడుదల చేసిన ఐపీఎల్ జట్టులో ఓపెనర్ గా వీరేంద్ర సెహ్వాగ్ కు స్థానం దక్కింది. అయితే అతనితో కలిసి ఓపెనింగ్ చేసే బాధ్యతను క్రిస్ గేల్ కు కట్టబెట్టాడు అగార్కర్. మరొకవైపు మిడిల్ ఆర్డర్ లో రోహిత్ శర్మ, సురేష్ రైనా,విరాట్ కోహ్లి, డివిలియర్స్ లకు చోటు కల్పించగా, ఆల్ రౌండర్లగా హర్భజన్ సింగ్, సునీల్ నరైన్ లను ఎంపిక చేశాడు. ఇక బౌలింగ్ విషయానికొస్తే లసిత్ మలింగా, జస్ప్రిత్ బూమ్రా, ఆశిష్ నెహ్రాలను అగార్కర్ తన ఆల్ టైమ్ ఐపీఎల్ జట్టులో ఎంపిక చేశాడు.

అగార్కర్ జట్టు ఇదే: విరాట్ కోహ్లి(కెప్టెన్), క్రిస్ గేల్, వీరేంద్ర సెహ్వాగ్, సురేశ్ రైనా, రోహిత్ శర్మ, ఏబీ డివిలియర్స్(వికెట్ కీపర్), లసిత్ మలింగా, బూమ్రా, ఆశిష్ నెహ్రా, సునీల్ నరైన్, హర్భజన్ సింగ్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement