ప్లీజ్... గెలవండి! | vijay mallya urges rcb to lift ipl 7 trophy | Sakshi
Sakshi News home page

ప్లీజ్... గెలవండి!

Apr 17 2014 2:06 AM | Updated on Sep 2 2017 6:07 AM

ప్లీజ్... గెలవండి!

ప్లీజ్... గెలవండి!

ఈసారి ఎలాగైనా ఐపీఎల్ ట్రోఫీని గెలవాలని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) ఫ్రాంచైజీ యజమాని విజయ్ మాల్యా తన మనసులోని కోరికను ఆటగాళ్ల ముందు బయటపెట్టారు.

ఆటగాళ్లను కోరిన మాల్యా
 షార్జా: ఈసారి ఎలాగైనా ఐపీఎల్ ట్రోఫీని గెలవాలని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) ఫ్రాంచైజీ యజమాని విజయ్ మాల్యా తన మనసులోని కోరికను ఆటగాళ్ల ముందు బయటపెట్టారు.
 
క్రికెటర్లతో జరిగిన చర్చ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆటగాళ్లు, సహాయక సిబ్బందికి సాదర స్వాగతం పలికిన మాల్యా భారీ మొత్తానికి కొనుగోలు చేసిన యువరాజ్‌ను ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ‘మీరు ఏదైనా చేయగలరు. ఆ విషయం మీకు తెలుసు. ఐపీఎల్-7 ట్రోఫీని మనం అందుకోవాలి. జట్టులో మంచి వాతావరణం ఉంది. కాబట్టి శ్రమిస్తే ఫలితం అనుకూలంగా వస్తుంది’ అని మాల్యా వ్యాఖ్యానించారు. షార్జాలో గురువారం ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగే మ్యాచ్‌తో ఆర్‌సీబీ ఐపీఎల్‌లో తమ పోరును ప్రారంభిస్తుంది.
 

Advertisement
 
Advertisement
Advertisement