కెప్టెన్‌గా వందన | Vandana to lead India hockey team at Asian Champions Trophy | Sakshi
Sakshi News home page

కెప్టెన్‌గా వందన

Oct 5 2016 12:05 AM | Updated on Sep 4 2017 4:09 PM

కెప్టెన్‌గా వందన

కెప్టెన్‌గా వందన

ఈ నెలాఖర్లో సింగపూర్‌లో జరిగే ఆసియా చాంపియన్‌‌స ట్రోఫీ హాకీ టోర్నమెంట్‌లో పాల్గొనే భారత మహిళల జట్టుకు వందన కటారియా కెప్టెన్‌గా వ్యవహరించనుంది.

న్యూఢిల్లీ: ఈ నెలాఖర్లో సింగపూర్‌లో జరిగే ఆసియా చాంపియన్‌‌స ట్రోఫీ హాకీ టోర్నమెంట్‌లో పాల్గొనే భారత మహిళల జట్టుకు వందన కటారియా కెప్టెన్‌గా వ్యవహరించనుంది. ఈ టోర్నీలో పాల్గొనే 18 మంది సభ్యుల భారత జట్టును మంగళవారం ప్రకటించారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన 24 ఏళ్ల వందన ఇప్పటివరకు భారత్ తరఫున 120 మ్యాచ్‌లు ఆడి 35 గోల్స్ చేసింది. ఆంధ్రప్రదేశ్ అమ్మాయి యతిమరపు రజని రెండో గోల్‌కీపర్‌గా ఎంపికైంది. మరో గోల్‌కీపర్‌గా సవిత వ్యవహరించనుంది.
 
 డిఫెండర్ సునీత లాక్రా వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తుంది. ఈ టోర్నీలో భారత్‌తోపాటు డిఫెండింగ్ చాంపియన్ జపాన్, చైనా, కొరియా, మలేసియా బరిలో ఉన్నాయి. గత మూడు వారాలుగా భోపాల్‌లోని భారత స్పోర్‌‌ట్స అథారిటీ (సాయ్) కేంద్రంలో భారత జట్టుకు శిక్షణ శిబిరం కొనసాగుతోంది.
 
భారత మహిళల హాకీ జట్టు
 సవిత, యతిమరపు రజని (గోల్‌కీపర్లు), వందన కటారియా (కెప్టెన్), సునీత లాక్రా (వైస్ కెప్టెన్), దీప్ గ్రేస్ ఎక్కా, రేణుక యాదవ్, హినియాలుమ్ లాల్ రువాత్ ఫెలి, నమితా టొప్పో, నిక్కీ ప్రధాన్, నవజ్యోత్ కౌర్, మోనిక, రాణి రాంపాల్, దీపిక, నవదీప్ కౌర్, పూనమ్ రాణి, అనురాధ దేవి, ప్రీతి దూబే, పూనమ్ బార్లా.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement