స్వారెజ్.. మా బాగా కొరికావే! | Uruguayan president welcomes home Suarez | Sakshi
Sakshi News home page

స్వారెజ్.. మా బాగా కొరికావే!

Jun 28 2014 3:22 PM | Updated on Oct 22 2018 5:58 PM

బ్రెజిల్ లో జరుగుతున్న ప్రపంచ కప్ ఫుట్ బాల్ నుంచి బహిష్కరణకు గురైన ఉరుగ్వే ఆటగాడు లూయిస్ స్వారెజ్ కు ఆ దేశంలో ఘన స్వాగతం లభించింది.

మోంటోవీడియో: బ్రెజిల్ లో జరుగుతున్న ప్రపంచ కప్ ఫుట్ బాల్ మ్యాచ్ లో అవతలి జట్టు ఆటగాడి భుజం కొరికి.. బహిష్కరణకు గురైన ఉరుగ్వే ఆటగాడు లూయిస్ స్వారెజ్ కు అతడి సొంత దేశంలో ఘన స్వాగతం లభించింది. శనివారం మోంటోవీడియో విమానాశ్రయానికి చేరుకున్న ఈ స్టార్ ప్లేయర్ కు అభిమానులు భారీగా ఆహ్వానం పలికారు. స్వదేశానికి చేరుకున్న స్వారెజ్ కు ఆ దేశ అధ్యక్షడు జోస్ ముజైకా కూడా మద్దతు పలికారు. సార్వెజ్ పై తొమ్మిది మ్యాచ్ లతో సహా నాలుగు నెలలు పాటు బహిష్కరణ వేటు వేయడాన్ని ముజైకా తప్పుబట్టారు. 'అది ఒక వ్యక్తి మీద తీసుకున్న నిర్ణయం కాదు. దేశాన్ని అవమానించే సంఘటన. యావత్తు దేశంపై తీసుకున్న ప్రతీకార చర్య 'అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.

మొన్న ఇటలీతో జరిగిన మ్యాచ్ లో జియార్జియో చిలి భుజాన్ని లూయిస్ స్వారెజ్ కొరికి గాయపరచడంతోఎ ఫిఫా విచారణకు ఆదేశించింది. దీంతో అతనిపై తొమ్మిది మ్యాచ్ ల నిషేధం విధించింది. దీంతో పాటు నాలుగు నెలల పాటు అంతర్జాతీయంగా ఏ మ్యాచ్ లోనూ స్వారెజ్ పాల్గొనకుండా ఉండాలని ఫిఫా ఆదేశించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement