60 సీసీ కెమెరాలతో ఉప్పల్ స్టేడియంపై నిఘా! | Uppal stadium to tight security over IPL match 2015 | Sakshi
Sakshi News home page

60 సీసీ కెమెరాలతో ఉప్పల్ స్టేడియంపై నిఘా!

May 1 2015 6:27 PM | Updated on Sep 3 2017 1:14 AM

60 సీసీ కెమెరాలతో ఉప్పల్ స్టేడియంపై నిఘా!

60 సీసీ కెమెరాలతో ఉప్పల్ స్టేడియంపై నిఘా!

మే 2 న హైదరాబాద్లోని ఉప్పల్ రాజీవగాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో హైదరాబాద్, చెన్నై జట్ల మధ్య ఐపీఎల్ మ్యాచ్-8 జరుగనుంది.

హైదరాబాద్:  ఐపీఎల్ మ్యాచ్-8 లో భాగంగా హైదరాబాద్, చెన్నై జట్ల మధ్య మే 2 న జరగనున్న మ్యాచ్కు హైదరాబాద్లోని ఉప్పల్ రాజీవగాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదిక కానుంది. అందులోనూ హైదరాబాద్ మ్యాచ్ కావడంతో  ఈ మ్యాచ్ ను వీక్షించేందుకు ఎక్కువ సంఖ్యలో క్రికెట్ అభిమానులు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు సైబరాబాద్ పోలీస్ కమీషనర్ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా.. మందు జాగ్రత్త చర్యగా 1200 మంది పోలీసులతో బందోబస్తును ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. ఉప్పల్ స్టేడియం లోపల, బయట 60 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఈవ్ టీజర్స్ కోసం షీ టీమ్స్ బృందాలను రంగంలోకి దింపామని చెప్పారు. అయితే బయట నుంచి తెచ్చే వస్తువులను స్టేడియం లోపలకు అనుమతి లేదని సీవీ ఆనంద్ వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement