పీసీబీ తో సమావేశం అనవసరం | There was no need for BCCI to meet PCB: Goel | Sakshi
Sakshi News home page

పీసీబీ తో సమావేశం అనవసరం

May 30 2017 3:40 PM | Updated on Sep 5 2017 12:22 PM

పీసీబీ తో సమావేశం అనవసరం

పీసీబీ తో సమావేశం అనవసరం

పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డుతో సమావేశం అనవసరమని కేంద్ర క్రీడా..

► కేంద్ర క్రీడా మంత్రి విజయ్‌ గోయల్‌
 
న్యూఢిల్లీ: పాకిస్ధాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ)తో సమావేశమయ్యే అవసరం బీసీసీఐకి లేదని కేంద్ర క్రీడా మంత్రి విజయ్‌ గోయల్‌ అభిప్రాయ పడ్డారు. దుబాయ్‌ లో పీసీబీ అధికారులతో బీసీసీఐ సమావేశమవ్వడాన్ని గోయల్‌ తప్పుబట్టారు. వారు పీసీబీతో ఎందుకు సమావేశమయ్యారో అర్థం కావడం లేదన్నారు. పాక్‌ ఉగ్రవాద చర్యలు ఆపె వరకు ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగవని స్పష్టం చేశారు. సోమవారం బీసీసీఐ, పీసీబీల మధ్య జరిగిన సమావేశంపై  మీడియా ప్రశ్నించగా ఆయన పై విధంగా స్పందించారు. గోయల్‌ మిజోరం ముఖ్యమంత్రి లాల్ తన్హావాలాను కలిసి ఈశాన్య రాష్ట్రల్లో క్రీడల అభివృద్ధి విషయంపై చర్చించారు. ఇప్పటికే రూ.4.5 కోట్లతో ఫుట్‌ బాల్‌ మైదానాన్ని మంజూరు చేశామని గోయల్‌ తెలిపారు.
 
2015-2023 లోఇరుదేశాల మధ్య ఐదు ద్వైపాక్షిక సిరీస్‌ ఒప్పందాలు జరిగాయి. అయితే పాక్‌ ఉగ్రవాద చర్యలు ప్రోత్సహించడంతో ఈ సీరిస్‌లకు భారత ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. దీంతో పీసీబీ రూ.387 కోట్ల నష్ట పరిహారం చెల్లించాలంటు బీసీసీఐకి లీగల్‌ నోటిసులు పంపించింది. ఈ విషయం చర్చించేందుకు సోమవారం బీసీసీఐ సెక్రటరీ అమితాబ్‌ చౌదరీ, సీఈవో రాహుల్‌ జోహ్రి, జీఎం ఎంవీ శ్రీధర్‌లు దుబాయ్‌లో  పీసీబీ అధికారులతో సమావేశమ‍య్యారు. భారత ప్రభుత్వ అనుమతి లేకుండా ద్వైపాక్షిక సిరీస్‌లు కొనసాగించలేమని వారు పీసీబీ అధికారులకు తేల్చి చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement