గెలిచేవెన్ని... ఓడించేదెవర్ని!

There are talented players in the Afghanistan squad - Sakshi

బౌలింగే అఫ్గానిస్తాన్‌ బలం

రషీద్‌ ఖాన్, నబీలపైనే ఆశలు

అఫ్గానిస్తాన్‌ వరల్డ్‌కప్‌లో ఆడింది...ఆకట్టుకుంది... తక్కువే! కానీ కాలం కలిసొచ్చిన రోజు మాజీ ప్రపంచకప్‌ చాంపియన్‌నైనా ఓడించగలదని వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో నిరూపించింది. ఇక ఈ టోర్నీలో ఎవర్ని ఓడిస్తుందో చూడాలి.

క్రికెట్‌లో అఫ్గానిస్తాన్‌ పసికూనే! జట్టు ప్రభావం కూడా తక్కువే. ఇక ప్రపంచకప్‌  విషయానికొస్తే... ఒకే ఒక్క మెగా ఈవెంట్‌ ఆడింది. గత 2015 టోర్నీతో వన్డే వరల్డ్‌కప్‌లో భాగమైంది. రెండేళ్ల క్రితమే శాశ్వత సభ్యదేశంగా టెస్టు హోదా పొందిన ఈ అఫ్గాన్‌ జట్టులో ప్రతిభగల ఆటగాళ్లు ఉన్నారు. బౌలింగే ప్రధాన ఆయుధం. ఐపీఎల్‌ పుణ్యమాని రషీద్‌ ఖాన్‌ భారత క్రికెట్‌ అభిమానులకు బాగా పరిచయమయ్యాడు. బ్యాటింగ్‌లో నిలకడ లేకపోయినా బౌలింగ్‌తో ప్రత్యర్థుల్ని వణికించే వనరులున్న జట్టిది. అలనాటి జగజ్జేత అయిన వెస్టిండీస్‌ను కంగుతినిపించిన రికార్డు ఈ జట్టుకు ఉంది.

జట్టులోని బలాబలాల గురించి చెప్పుకుంటే ముందు వరుసలో ఉండేది బౌలింగే! రషీద్‌ ఖాన్‌ మాయాజాలం ఇదివరకే వార్తల్లోకెక్కింది. ముజీబుర్‌ రహ్మాన్‌ కూడా వైవిధ్యమున్న స్పిన్నర్‌. సీమర్‌ హమీద్‌ హసన్, కెప్టెన్‌ గుల్బదిన్‌ నైబ్‌లు ప్రధాన బౌలర్లు. ముందుగా తమ బ్యాట్స్‌మెన్‌ 200 పైచిలుకు స్కోరు చేస్తే ప్రత్యర్థి చేజింగ్‌ను ఇబ్బంది పెట్టగల బౌలర్లే వాళ్లంతా. అయితే ప్రత్యర్థి జట్టే ముందుగా బ్యాటింగ్‌ చేస్తే మాత్రం అంత ‘పవర్‌ఫుల్‌’ కాదు. బ్యాటింగ్‌లో మొహమ్మద్‌ షహజాద్‌ తురుపుముక్క. ఈ ఓవర్‌వెయిట్‌ బ్యాట్స్‌మన్‌కు ధాటిగా ఆడే సత్తా ఉంది. క్రీజులో పాతుకుపోతే ప్రభావవంతమైన ఇన్నింగ్స్‌ ఆడగలడు. ఆల్‌రౌండర్‌ నబీ కూడా భారీషాట్లతో అలరించే బ్యాట్స్‌మెన్‌.

లంకను గెలవొచ్చు...
అరంగేట్రం చేసిన గత ప్రపంచకప్‌లో అఫ్గానిస్తాన్‌... స్కాట్లాండ్‌ను ఓడించి ఖాతా తెరిచింది. ఆరు మ్యాచ్‌లాడి మిగతా ఐదింటా ఓడింది. ఇప్పుడు మాత్రం తొమ్మిది మ్యాచ్‌లు ఆడేందుకు తహతహలాడుతున్న ఈ జట్టు... శ్రీలంక, బంగ్లాదేశ్, విండీస్‌లను ఓడించినా ఆశ్చర్యం లేదు. ఇక అంతకుమించి ఆశిస్తే మాత్రం అది అత్యాశే అవుతుంది. ఆ మూడు మినహా ఏ జట్టు ఎవరికీ తీసిపోని విధంగా ప్రపంచకప్‌కు సిద్ధమై వచ్చాయి.

అందరినీ ఎదుర్కొనే అనుభవం...  
కచ్చితంగా గెలుస్తుందని గానీ, అందరి చేతిలో ఓడుతుందని గానీ చెప్పడం కష్టమే అయినా... భిన్నమైన ఫార్మాట్‌లో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్‌ అఫ్గాన్‌కు మంచి అనుభవాన్నిచ్చే టోర్నీగా నిలిచిపోతుంది. అదెలా అంటారా... ఇక్కడ బరిలో ఉన్న అన్ని జట్లతో ఢీకొనే భాగ్యం కల్పిస్తుంది ఈ టోర్నీ. కాబట్టి కూన... కూనతో కాకుండా హేమాహేమీలతో తలపడవచ్చు. నిప్పులు చెరిగే ప్రచండ బౌలర్లను ఎదుర్కోవచ్చు మరోవైపు గ్రేటెస్ట్‌ బ్యాట్స్‌మెన్‌కు తమ బౌలింగ్‌ రుచి చూపించవచ్చు. మొత్తానికి గెలవలేకపోయినా... గెలుపును మించే సంబరాన్ని చేసుకోవచ్చు కదా!

అఫ్గానిస్తాన్‌ జట్టు
గుల్బదిన్‌ నైబ్‌ (కెప్టెన్‌), హజ్రతుల్లా, షహజద్, దౌలత్‌ జద్రాన్, రహ్మత్‌ షా, అస్గర్, హష్మతుల్లా షాహిది, సమీయుల్లా షిన్వారి, నూర్‌ అలీ జద్రాన్, ఆఫ్తాబ్‌ ఆలమ్, హమీద్‌ హసన్, రషీద్‌ ఖాన్, ముజీబుర్‌ రహ్మాన్, మొహమ్మద్‌ నబీ.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

26-06-2019
Jun 26, 2019, 05:04 IST
సౌతాంప్టన్‌: శక్తి మేర ఆడితే తాము భారత్‌ను ఓడించగలమని అంటున్నాడు బంగ్లాదేశ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ షకీబుల్‌ హసన్‌. ప్రస్తుతం సూపర్‌...
26-06-2019
Jun 26, 2019, 04:56 IST
బర్మింగ్‌హామ్‌: ప్రపంచ కప్‌లో అజేయంగా దూసుకెళ్తూ సెమీఫైనల్స్‌ మెట్టెక్కేందుకు ఒక్క గెలుపు దూరంలో ఉంది న్యూజిలాండ్‌. మరోవైపు నాకౌట్‌ చేరాలంటే...
26-06-2019
Jun 26, 2019, 04:37 IST
వరల్డ్‌ నంబర్‌వన్‌ జట్టు హోదాలో, సొంతగడ్డపై ప్రపంచకప్‌ ఫేవరెట్‌గా భారీ అంచనాలతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ కోటకు బీటలు...
25-06-2019
Jun 25, 2019, 23:46 IST
లండన్‌: ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విధ్వంసకర ఆటగాడు గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ స్టన్నింగ్‌ ఫీల్డింగ్‌తో ఔరా అనిపించాడు. ఆసీస్‌...
25-06-2019
Jun 25, 2019, 22:53 IST
లండన్‌: సమఉజ్జీల పోరులో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియానే పై చేయి సాధించింది. శ్రీలంక, పాకిస్తాన్‌లపై అనూహ్య పరాజయాలు చవిచూసిన ఇంగ్లండ్‌.....
25-06-2019
Jun 25, 2019, 21:08 IST
లండన్‌: ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ స్టొయినిస్‌ రనౌట్‌ అయిన తీరుపై ఆ జట్టు ఫ్యాన్స్‌ ఆగ్రహం...
25-06-2019
Jun 25, 2019, 20:11 IST
బర్మింగ్‌హమ్‌ : టీమిండియాపై ఓటమి అనంతరం పుంజుకొని దక్షిణాఫ్రికాపై విజయం అందుకున్న పాకిస్తాన్‌ తన తదుపరి మ్యాచ్‌ బలమైన న్యూజిలాండ్‌తో తలపడనుంది....
25-06-2019
Jun 25, 2019, 19:46 IST
ఆసీస్‌ పేస్‌ అటాకింగ్‌కు బెంబేలెత్తుతున్న ఇంగ్లండ్‌ 
25-06-2019
Jun 25, 2019, 18:45 IST
టాపార్డర్‌ జోరును చూసి ఆసీస్‌ 300కి పైగా పరుగులు సాధిస్తుందని భావించారు
25-06-2019
Jun 25, 2019, 18:10 IST
లండన్‌: ఇంగ్లండ్‌ వేదికగా జరుగుతన్న ప్రపంచకప్‌లో ఐపీఎల్‌ స్టార్‌ బౌలర్‌, అఫ్గానిస్తాన్‌ సంచలనం రషీద్‌ ఖాన్‌ తీవ్రంగా నిరాశ పరుస్తున్నాడు....
25-06-2019
Jun 25, 2019, 17:00 IST
మాంచెస్టర్‌ : పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌలింగ్‌ చేస్తుండగా కండరాలు పట్టేయడంతో టీమిండియా బౌలర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ మధ్యలోనే వెనుతిరిగిన సంగతి తెలిసిందే....
25-06-2019
Jun 25, 2019, 14:43 IST
ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండ్‌ జట్టు ట్యాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది.
25-06-2019
Jun 25, 2019, 14:03 IST
మేటి ఆటగాళ్లంతా ఉన్నా సచిన్‌కు సాధ్యం కానిది ధోని అతడికి కానుకగా ఇచ్చాడు.
25-06-2019
Jun 25, 2019, 11:25 IST
బంగ్లా తర్వాతే మాజీ చాంపియన్లు శ్రీలంక, పాక్, వెస్టిండీస్‌లు కొనసాగడం..
25-06-2019
Jun 25, 2019, 10:28 IST
భారత్‌తో ఓటమి అనంతరం వచ్చిన విమర్శలు, ట్రోలింగ్‌తో
25-06-2019
Jun 25, 2019, 05:00 IST
లార్డ్స్‌: క్రికెట్‌ మక్కాగా పిలవబడే లార్డ్స్‌ మైదానం సమఉజ్జీల సమరానికి వేదిక కానుంది. ప్రపంచ కప్‌లో భాగంగా నేడు డిఫెండింగ్‌...
25-06-2019
Jun 25, 2019, 04:49 IST
భళారే బంగ్లా! షకీబ్‌ ఆల్‌రౌండ్‌ షోతో ఈ ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌ మాజీ చాంపియన్లను మించిపోయింది. సఫారీ కంటే ఎన్నో రెట్లు...
24-06-2019
Jun 24, 2019, 20:32 IST
లండన్‌: బంగ్లాదేశ్‌ ఆల్‌ రౌండర్‌ షకీబుల్‌ హసన్‌ అరుదైన ఘనతను సాధించాడు. ఓవరాల్‌ వరల్డ్‌కప్‌లో వెయ్యి పరుగులు సాధించిన తొలి...
24-06-2019
Jun 24, 2019, 20:15 IST
లండన్‌: మోకాలి గాయంతో బాధపడుతున్న వెస్టిండీస్‌ స్టార్‌ ఆల్‌ రౌండర్‌ ఆండ్రీ రసెల్‌ వరల్డ్‌కప్‌ నుంచి వైదొలిగాడు. వన్డే వరల్డ్‌కప్‌...
24-06-2019
Jun 24, 2019, 19:26 IST
మాంచెస్ట‌ర్‌: కండరాల నొప్పితో బాధపడుతున్న టీమిండియా పేసర్‌ భువనేశ్వర్‌కు స్టాండ్‌ బై ప్లేయర్‌గా న‌వ్‌దీప్ షైనీకి భార‌త క్రికెట్ జ‌ట్టు...
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top