హరికృష్ణకు మూడో స్థానం | The third place for Harikrishna | Sakshi
Sakshi News home page

హరికృష్ణకు మూడో స్థానం

Aug 3 2017 12:16 AM | Updated on Aug 29 2018 1:13 PM

హరికృష్ణకు మూడో స్థానం - Sakshi

హరికృష్ణకు మూడో స్థానం

బీల్‌ ఓపెన్‌ అంతర్జాతీయ చెస్‌ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్‌ పెంటేల హరికృష్ణ మూడో స్థానం సంపాదించాడు.

బీల్‌ ఓపెన్‌ అంతర్జాతీయ చెస్‌ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్‌ పెంటేల హరికృష్ణ మూడో స్థానం సంపాదించాడు. స్విట్జర్లాండ్‌లో బుధవారం ముగిసిన ఈ టోర్నీలో హరికృష్ణ 5.5 పాయింట్లు సాధించాడు. చివరిదైన తొమ్మిదో రౌండ్‌లో హరికృష్ణ తెల్లపావులతో ఆడుతూ 29 ఎత్తుల్లో ఎటెన్ని బాక్రోట్‌ (ఫ్రాన్స్‌) చేతిలో ఓడిపోయాడు.

ఈ టోర్నీలో హరికృష్ణకిదే తొలి ఓటమి కావడం గమనార్హం. ఐదు గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్న హరికృష్ణ, మరో మూడు గేముల్లో గెలిచాడు. 6.5 పాయింట్లతో బాక్రోట్‌ విజేతగా అవతరించగా... ప్రపంచ మహిళల చాంపియన్‌ హూ ఇఫాన్‌ (చైనా) 6 పాయింట్లతో రన్నరప్‌గా నిలిచింది. 

Advertisement
 
Advertisement
Advertisement