దీక్షితకు స్వర్ణం | Telangana Weight Lifter Deekshita gets Gold Medal in National Championship | Sakshi
Sakshi News home page

దీక్షితకు స్వర్ణం

Feb 25 2019 9:53 AM | Updated on Feb 25 2019 9:53 AM

Telangana Weight Lifter Deekshita gets Gold Medal in National Championship - Sakshi

హైదరాబాద్‌: జాతీయ స్థాయి వెయిట్‌ లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ లిఫ్టర్‌ దీక్షిత సత్తా చాటింది. విశాఖపట్నంలో జరుగుతున్న ఈ టోర్నీలో స్వర్ణాన్ని సాధించింది. సీనియర్‌ మహిళల విభాగంలో దీక్షిత చాంపియన్‌గా నిలిచింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వెయిట్‌ లిఫ్టింగ్‌ సంఘం అధ్యక్షుడు రామకోటేశ్వరరావు, హైదరాబాద్‌ జిల్లా వెయిట్‌ లిఫ్టింగ్‌ సంఘం కార్యదర్శి ఎన్‌. చంద్రశేఖర్‌ గౌడ్‌ అభినందించారు. భవిష్యత్‌లో ఆమె మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు.   

Advertisement
 
Advertisement
Advertisement