నేటి నుంచి తెలంగాణ టీటీ టోర్నీ | Telangana TT tournament starts from today | Sakshi
Sakshi News home page

నేటి నుంచి తెలంగాణ టీటీ టోర్నీ

Nov 13 2014 12:46 AM | Updated on Apr 7 2019 4:30 PM

నేటి నుంచి తెలంగాణ టీటీ టోర్నీ - Sakshi

నేటి నుంచి తెలంగాణ టీటీ టోర్నీ

అనంత నారాయణ రెడ్డి, రామేశ్వరమ్మ స్మారక తెలంగాణ అంతర్ జిల్లా టేబుల్ టెన్నిస్ (టీటీ) టోర్నమెంట్ నేటి నుంచి జరగనుంది.

నిఖత్, నైనాలకు టాప్ సీడింగ్

 సాక్షి, హైదరాబాద్: అనంత నారాయణ రెడ్డి, రామేశ్వరమ్మ స్మారక తెలంగాణ అంతర్ జిల్లా టేబుల్ టెన్నిస్ (టీటీ) టోర్నమెంట్ నేటి నుంచి జరగనుంది. హైదరాబాద్ అమ్మాయిలు నిఖత్ బాను (మహిళలు), నైనా జైస్వాల్ (యూత్ బాలికలు) టాప్ సీడ్లుగా బరిలోకి దిగనున్నారు. ఆకుల శ్రీజకు జూనియర్ బాలికల విభాగంలో టాప్ సీడింగ్ దక్కింది. పురుషుల విభాగంలో చంద్రచూడ్... జూనియర్, సబ్ జూనియర్ బాలుర కేటగిరీలో స్నేహిత్, యూత్ బాలుర విభాగంలో హర్ష లహోటి టాప్ సీడ్లుగా బరిలోకి దిగుతారు.

ఖైరతాబాద్‌లోని ఆనంద్‌నగర్ వెల్ఫేర్ అసోసియేషన్‌లో గురువారం నుంచి 16వ తేదీ వరకు పోటీలు నిర్వహిస్తారు. నాలుగు రోజుల పాటు జరిగే టోర్నమెంట్‌లో 621 ఎంట్రీలు వచ్చాయి. ఈవెంట్ ప్రారంభోత్సవానికి స్థానిక ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి పోటీలను లాంఛనంగా ఆరంభిస్తారని ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎ.నరసింహారావు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement