తెలంగాణ జట్లకు టైటిల్స్ | telangana teams won titles | Sakshi
Sakshi News home page

తెలంగాణ జట్లకు టైటిల్స్

Oct 13 2014 1:39 AM | Updated on Sep 2 2017 2:44 PM

తెలంగాణ జట్లకు టైటిల్స్

తెలంగాణ జట్లకు టైటిల్స్

కరీంనగర్ స్పోర్ట్స్: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన 60వ జాతీయ స్థాయి పాఠశాలల అండర్-14 బాలబాలికల ఖోఖో చాంపియన్‌షిప్ పోటీల్లో...

జాతీయ స్కూల్‌గేమ్స్ ఖోఖో

 కరీంనగర్ స్పోర్ట్స్: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన 60వ జాతీయ స్థాయి పాఠశాలల అండర్-14 బాలబాలికల ఖోఖో చాంపియన్‌షిప్ పోటీల్లో రెండు విభాగాల్లోనూ తెలంగాణ జట్లు విజయకేతనం ఎగురవేశారుు. కరీంనగర్ మండలం కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఈ టెక్నో పాఠశాలలో ఈ నెల 8 నుంచి జరుగుతున్న ఈ పోటీలు ఆదివారం ముగిశారుు.

 దేశంలోని 23 రాష్ట్రాల నుంచి 23 బాలుర, 22 బాలికల జట్లు  ఈ పోటీల్లో పాల్గొన్నాయి. బాలుర విభాగంలో కర్ణాటక జట్టు రెండో స్థానంలో, మహారాష్ట్ర, గుజరాత్ జట్లు వరుసగా మూడు, నాలుగో స్థానాల్లో నిలిచాయి. బాలికల విభాగంలో ఢిల్లీ జట్టు రెండో స్థానంలో, కర్ణాటక, గుజరాత్ జట్లు వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి.

Advertisement
 
Advertisement
Advertisement