స్విమ్మింగ్ ఓవరాల్ చాంప్ ఓక్రిడ్జ్ | swimming overall champ oakridge | Sakshi
Sakshi News home page

స్విమ్మింగ్ ఓవరాల్ చాంప్ ఓక్రిడ్జ్

Sep 22 2013 12:11 AM | Updated on Sep 1 2017 10:55 PM

అంతర్ పాఠశాలల జూనియర్, సీనియర్ ఆక్వాటిక్ మీట్‌లో ఓక్రిడ్జ్ అంతర్జాతీయ స్కూల్ (ఖాజాగూడ) సత్తాచాటింది. గ్లెన్‌డేల్ అకాడమీలో శనివారం నిర్వహించిన స్విమ్మింగ్ పోటీల్లో ఓక్రిడ్జ్ బృందం ఓవరాల్ చాంపియన్‌షిప్ సాధించింది. ఈ పోటీల్లో 14 పాఠశాలల జట్లు పాల్గొన్నాయి.

రాయదుర్గం, న్యూస్‌లైన్: అంతర్ పాఠశాలల జూనియర్, సీనియర్ ఆక్వాటిక్ మీట్‌లో ఓక్రిడ్జ్ అంతర్జాతీయ స్కూల్ (ఖాజాగూడ) సత్తాచాటింది. గ్లెన్‌డేల్ అకాడమీలో శనివారం నిర్వహించిన స్విమ్మింగ్ పోటీల్లో ఓక్రిడ్జ్ బృందం ఓవరాల్ చాంపియన్‌షిప్ సాధించింది. ఈ పోటీల్లో 14 పాఠశాలల జట్లు పాల్గొన్నాయి.
 
  ఇందులో ఓక్రిడ్జ్ పాఠశాల విద్యార్థులు జూనియర్, సీనియర్ విభాగాల్లో ఏడు బంగారు పతకాలు, ఐదు రజతాలు, మూడు కాంస్య పతకాలు గెలుపొందారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ కెప్టెన్ రోహిత్ సేన్ బజాజ్ విజేతలుగా నిలిచిన విద్యార్థులను, కోచ్‌లను అభినందించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement