స్మిత్‌ 1, కోహ్లి 2

Steve Smith at No1 in ICC Test ranking and  Virat Kohli No 2 - Sakshi

ఐసీసీ ర్యాంకింగ్స్‌ యథాతథం 

దుబాయ్‌: అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) టెస్టు బ్యాట్స్‌మన్‌ ర్యాంకింగ్స్‌లో ఆ్రస్టేలియా స్టార్‌ స్టీవ్‌ స్మిత్‌ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. యాషెస్‌ సిరీస్‌లో 774 పరుగులతో సత్తా చాటిన స్మిత్‌ 937 ర్యాంకింగ్‌ పాయింట్లతో నంబర్‌వన్‌గా ఉన్నాడు. భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి (903) రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. టాప్‌–10లో భారత్‌ నుంచి పుజారా నాలుగు, రహానే ఏడో స్థానంలో నిలిచారు. యాషెస్‌కు ముందు 5వ ర్యాంక్‌లో ఉన్న ఆసీస్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ ఘోర వైఫల్యం తర్వాత ఏకంగా 19 స్థానాలు కోల్పోయి 24కు పడిపోవడం గమనార్హం. ఆస్ట్రేలియా యాషెస్‌ను నిలబెట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన ప్యాట్‌ కమిన్స్‌ (908 పాయింట్లు) బౌలర్ల జాబితాలో నంబర్‌వన్‌గానే నిలిచాడు. భారత పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. టెస్టు ఆల్‌రౌండర్ల జాబితాలో జేసన్‌ హోల్డర్‌ మొదటి, రవీంద్ర జడేజా రెండో స్థానంలో ఉన్నారు. విండీస్‌తో రెండు టెస్టులు ఆడకపోయినా... రవిచంద్రన్‌ అశ్విన్‌ ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top