సెయింట్ మార్టిన్స్ గెలుపు | st martins won basket ball league | Sakshi
Sakshi News home page

సెయింట్ మార్టిన్స్ గెలుపు

Jan 30 2014 12:10 AM | Updated on Sep 2 2017 3:09 AM

బీఎఫ్‌ఐ-ఐఎంజీ బాస్కెట్‌బాల్ లీగ్‌లో సెయింట్ మార్టిన్స్ కాలేజి 52-51తో సీవీఎస్‌ఆర్ కాలేజిపై విజయం సాధించింది.

జింఖానా, న్యూస్‌లైన్: బీఎఫ్‌ఐ-ఐఎంజీ బాస్కెట్‌బాల్ లీగ్‌లో సెయింట్ మార్టిన్స్ కాలేజి 52-51తో సీవీఎస్‌ఆర్ కాలేజిపై విజయం సాధించింది. సికింద్రాబాద్‌లోని వైఎంసీఏలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆట ప్రారంభం నుంచి సెయింట్ మార్టిన్స్ ఆటగాళ్లు విశాల్ (20), సంతోష్  చక్కటి సమన్వయంతో ఆడటంతో ఒక సమయంలో 18-6తో జట్టు ముందంజలో ఉంది. అయితే వెంటనే తేరుకున్న సీవీఎస్‌ఆర్ ఆటగాళ్లు ప్రతిఘటించేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ మ్యాచ్ మొదటి అర్ధ భాగం ముగిసే సమయానికి 26-20తో సెయింట్ మార్టిన్స్ జట్టు ఆధిక్యంలో నిలిచింది. అనంతరం సెయింట్ మార్టిన్స్ ఆటగాళ్లు చెలరేగడంతో జట్టు మళ్లీ 44-33తో ముందంజలో నిలిచింది.
 

  సీవీఎస్‌ఆర్ క్రీడాకారులు కృష్ణ (15), వివేక్ (13), మహేష్ (13) ప్రతిఘటించినప్పటికీ ఫలితం దక్కలేదు. సెయింట్ మార్టిన్స్ క్రీడాకారులు విశాల్‌తో పాటు జోన (12), సాయి (9) జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. మహిళల విభాగంలో సీవీఎస్‌ఆర్ కాలేజి 32-22తో సెయింట్ ఆన్స్ కాలేజిపై గెలిచింది. మ్యాచ్ ప్రథ మార్ధం ముగిసే సమయానికి 17-11తో సీవీఎస్‌ఆర్ ముందంజలో ఉంది. సీవీఎస్‌ఆర్ జట్టు క్రీడాకారిణులు ప్రత్యూష (15), స్పందన (9) చాకచ క్యంగా వ్యవహరించడంతో జట్టుకు విజయం చేకూరింది. సెయింట్ ఆన్స్ క్రీడాకారిణులు దివ్య (13), కీర్తి (9) రాణించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement