లంక టాపార్డర్ను తిప్పేశారు.. | srilanka 108/5 at lunch on day 3 in 1st test | Sakshi
Sakshi News home page

లంక టాపార్డర్ను తిప్పేశారు..

Aug 14 2015 12:26 PM | Updated on Nov 9 2018 6:43 PM

లంక టాపార్డర్ను తిప్పేశారు.. - Sakshi

లంక టాపార్డర్ను తిప్పేశారు..

తొలి టెస్టులో భారత బౌలర్లు విజృంభిస్తున్నారు. స్పిన్ బౌలింగ్తో లంక టాపార్డర్ ను తిప్పేశారు.

గాలె: తొలి టెస్టులో భారత బౌలర్లు విజృంభిస్తున్నారు. స్పిన్ బౌలింగ్తో లంక టాపార్డర్ ను తిప్పేశారు. ఈ మ్యాచ్పై భారత్ పూర్తిగా పట్టుబిగించగా.. శ్రీలంక ఎదురీదుతోంది. లంక ఇన్నింగ్స్ ఓటమి తప్పించుకోవడానికి ఇంకా 84 పరుగులు వెనకబడి ఉండగా, చేతిలో ఐదు వికెట్లున్నాయి.

5/2 ఓవర్నైట్ స్కోరుతో మ్యాచ్ మూడో జోరు శుక్రవారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన లంకేయులు.. లంచ్ సమయానికి 108/5 స్కోరు చేసింది. సంగక్కర 40, మాథ్యూస్ 39 పరుగులు చేశారు. చాందిమల్, తిరుమన్నె క్రీజులో ఉన్నారు. భారత స్పిన్నర్లు అశ్విన్, అమిత్ మిశ్రా రెండేసి వికెట్లు పడగొట్టారు. వరుణ్ అరోన్ ఓ వికెట్ తీశాడు. తొలి ఇన్నింగ్స్ల్లో లంక 183, భారత్ 375 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. భారత బౌలర్లు ఇదే జోరు కొనసాగిస్తే మూడో రోజే భారీ విజయంతో ఆట ముగించినా ఆశ్చర్యపోనవసరం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement