చెస్‌ చాంప్స్‌ శ్రీథన్, అస్మిత

Sridhan, Asmita Won Chess Titles - Sakshi

తెలంగాణ రాష్ట్ర స్కూల్స్‌ చెస్‌ టోర్నీ

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర స్కూల్స్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌లో శ్రీథన్, అస్మిత చాంపియన్‌లుగా నిలిచారు. తెలంగాణ రాష్ట్ర చెస్‌ సంఘం (టీఎస్‌సీఏ) ఆధ్వర్యంలో జరిగిన ఈ టోర్నీలో అండర్‌–15 బాలుర విభాగంలో శ్రీథన్‌ 5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. ఉమేశ్‌ 4 పాయింట్లతో రన్నరప్‌గా నిలవగా, బి. సాయి అచ్యుత్‌ మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. బాలికల విభాగంలో అస్మితా రెడ్డి, వర్షిత 3.5 పాయింట్లతో సంయుక్తంగా తొలి స్థానంలో నిలిచారు. అయితే మెరుగైన టైబ్రేక్‌ స్కోరు ఆధారంగా అస్మితా విజేతగా నిలవగా, వర్షిత రన్నరప్‌తో సరిపెట్టుకుంది. నటురా బేతి మూడో స్థానాన్ని దక్కించుకుంది. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో నీథమ్‌ డైరెక్టర్‌ సి. చిన్నం రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు బహుమతులు అందజేశారు.  
ఇతర వయో విభాగాల విజేతల వివరాలు 

అండర్‌-7 బాలురు: 1. నిహాల్‌ గౌతమ్, 2. కార్తికేయన్‌ నందన్‌; బాలికలు: 1. అభిగ్య, 2. పూజిత.  
అండర్‌-9 బాలురు: 1. సుహాన్, 2. అద్వయ్‌; బాలికలు: 1. యోగహర్షిణి, 2. రుషిత. 
అండర్‌-11 బాలురు: 1. సుశాంత్, 2. విఘ్నేశ్‌; బాలికలు: 1. జాహ్నవి, నాగలక్ష్మి. 
అండర్‌–13 బాలురు: 1. శ్రీశ్వాన్, 2. అభినవ్‌; బాలికలు: 1. కీర్తి, 2. గీతిక. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top