ఉమేష్ అవుట్.. అరవింద్ ఇన్! | Sreenath Aravind replaces Umesh Yadav in India's ODI squad for the last two matches against South Africa | Sakshi
Sakshi News home page

ఉమేష్ అవుట్.. అరవింద్ ఇన్!

Oct 19 2015 3:52 PM | Updated on Sep 3 2017 11:12 AM

ఉమేష్ అవుట్.. అరవింద్ ఇన్!

ఉమేష్ అవుట్.. అరవింద్ ఇన్!

దక్షిణాఫ్రికాతో జరుగనున్న మిగిలిన రెండు వన్డేలకు, తొలి రెండు టెస్టులకు భారత క్రికెట్ జట్టును ఎంపిక చేశారు.

బెంగళూరు: దక్షిణాఫ్రికాతో జరుగనున్న మిగిలిన రెండు వన్డేలకు, తొలి రెండు టెస్టులకు భారత క్రికెట్ జట్టును ఎంపిక చేశారు. ఈ మేరకు సోమవారం చీఫ్ సెలెక్టర్ సందీప్ పాటిల్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ సమావేశమైంది.  చివరి రెండు వన్డేలకు పేసర్ ఉమేష్ యాదవ్ ను పక్కకు పెట్టగా,  కర్ణాటక పేసర్ శ్రీనాథ్ అరవింద్ కు చోటు కల్పించారు. ఈ ఒక్క మార్పు మినహా వన్డే జట్టును యథాతధంగా కొనసాగించాలని సెలెక్షన్ కమిటీ నిర్ణయించింది.

 

ఇక రంజీ ట్రోఫీల్లో అదరగొట్టిన రవీంద్ర జడేజాను మొదటి రెండు టెస్టులకు ఎంపిక చేశారు. ఇదిలా ఉండగా టెస్టు టీమ్ లో హర్భజన్ కు స్థానం కల్పించలేదు.

 

చివరి రెండు వన్డేలకు..

మహేంద్ర సింగ్ ధోని(కెప్టెన్), స్టువర్ట్ బిన్నీ, శిఖర్ ధవన్, విరాట్ కోహ్లి, భువనేశ్వర్ కుమార్, అక్షర్ పటేల్, అజింక్యా రహానే, సురేష్ రైనా, అంబటి రాయుడు, మోహిత్ శర్మ, రోహిత్ శర్మ, ఎస్ అరవింద్, గురుకీరత్ సింగ్, అమిత్ మిశ్రా, హర్భజన్ సింగ్

తొలి రెండు టెస్టులకు..

విరాట్ కోహ్లి(కెప్టెన్), మురళీ విజయ్,  చటేశ్వర పుజారా, అజింక్యా రహానే, రోహిత్ శర్మ, వృద్ధిమాన్ సాహా, రవీంద్ర జడేజా, అమిత్ మిశ్రా, భువనేశ్వర్ కుమార్, ఉమేష్ యాదవ్, కేఎల్ రాహుల్,  బిన్నీ, అరోన్, ఇషాంత్, అశ్విన్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement