స్పోర్ట్స్ స్కూల్ సెలక్షన్స్‌కు 200 మంది హాజరు | sports school selection 200 players selected | Sakshi
Sakshi News home page

స్పోర్ట్స్ స్కూల్ సెలక్షన్స్‌కు 200 మంది హాజరు

Jul 24 2014 12:10 AM | Updated on Apr 7 2019 3:34 PM

రంగారెడ్డి జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో బుధవారం సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ కోసం సెలక్షన్ ట్రయల్స్ నిర్వహించారు.

 హుడాకాంప్లెక్స్: రంగారెడ్డి జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో బుధవారం సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ కోసం సెలక్షన్ ట్రయల్స్ నిర్వహించారు. 2014-15 విద్యా సంవత్సరానికి గాను 4వ తరగతిలో అడ్మిషన్ల కొరకు సెలక్షన్ ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. జిల్లాలోని వివిధ మండలాల నుంచి సుమారు 200 మంది బాలబాలికలు ఇందులో పాల్గొన్నారని జిల్లా క్రీడాధికారి ఇ.వెంకటేశ్వర రావు తెలిపారు.
 
  ఈ సెలక్షన్ ట్రయల్స్‌లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తామని ఆయన చెప్పారు. రంగారెడ్డి జిల్లా నుంచి 20 మంది చొప్పున బాలబాలికలను ఎంపిక చేసి వచ్చే నెలలో హకీంపేటలో నిర్వహించే రాష్ట్ర స్థాయి సెలక్షన్స్‌కు పంపిస్తామని ఆయన పేర్కొన్నారు. గురువారం కూడా సెలక్షన్ ట్రయల్స్ జరుగుతాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement