అథ్లెటిక్స్ ఫెడరేషన్‌పై సోర్ట్స్ అథారిటీ విమర్శలు | Sports Authority of India blames Athletics Federation of India for sending overage players to china | Sakshi
Sakshi News home page

అథ్లెటిక్స్ ఫెడరేషన్‌పై సోర్ట్స్ అథారిటీ విమర్శలు

Aug 19 2013 4:36 PM | Updated on Sep 1 2017 9:55 PM

అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాపై సోర్ట్స్ అథారిటీ విమర్శల వర్షం గుప్పించింది.

న్యూఢిల్లీ: అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాపై సోర్ట్స్ అథారిటీ విమర్శల వర్షం గుప్పించింది.  చైనాలో జరిగిన రెండో ఆసియన్ యూత్ గేమ్స్‌లో భారత అథ్లెట్లు ఘోరంగా విఫలం కావడంతో సోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మండిపడింది.  నాన్జింగ్‌కు 27 మంది సభ్యులు వెళ్లగా, 18 మంది ఎటువంటి పోటీ లేకుండా నిష్ర్కమించడంతో స్పోర్ట్స్ ఇండియా విమర్శలకు దిగింది.
 
 స్పోర్ట్స్ అథారిటీ డెరైక్టర్  జనరల్ జిజి థాంప్సన్ సోమవారం మాట్లాడుతూ..సభ్యులను ఎంపిక చేసేముందు పొరపాట్లు జరిగిన కారణంగానే అథ్లెటిక్స్ విఫలమైయ్యారన్నారు. ముందుగా  ప్రతి ఒక్కరూ టోర్నమెంట్ రూల్స్ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. ‘ మనం సెలెక్షన్స్ జరుగుతున్నప్పుడు అతిగా జోక్యం చేసుకుంటే పరిణామాలు ఇలానే ఉంటాయన్నాడు. అథ్లెట్లు ఎంపిక  ఆశ్చర్యానికి గురి చేసిందని' థాంప్సన్ తెలిపాడు..
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement