విదేశీ కోచ్‌ల కాంట్రాక్టు పొడిగించిన ‘సాయ్‌’  | Sports Authority Of India Has Extended The Contracts Of Foreign Coaches | Sakshi
Sakshi News home page

విదేశీ కోచ్‌ల కాంట్రాక్టు పొడిగించిన ‘సాయ్‌’ 

Jul 23 2020 3:29 AM | Updated on Jul 23 2020 3:29 AM

Sports Authority Of India Has Extended The Contracts Of Foreign Coaches - Sakshi

న్యూఢిల్లీ: భారత స్పోర్ట్స్‌ అథారిటీ (సాయ్‌) విదేశీ కోచ్‌ల ఒప్పందాల్ని పొడిగించింది. టోక్యో ఒలింపిక్స్‌ కోసం పలు క్రీడాంశాలకు చెందిన విదేశీ కోచ్‌లను నియమించిన ‘సాయ్‌’ ఇప్పుడు మెగా ఈవెంట్‌ వాయిదా పడటంతో కాంట్రాక్టు గడువునూ పొడిగించాల్సి వచ్చింది. 11 క్రీడాంశాలకు చెందిన మొత్తం 32 మంది విదేశీ కోచ్‌ల కాంట్రాక్టుల్ని వచ్చే ఏడాది సెప్టెంబర్‌ దాకా పొడిగించింది. గడువు పొడిగించిన వారిలో బాక్సింగ్‌ మేటి కోచ్‌లు శాంటియాకో నియెవా, రఫాలే బెర్గమస్కొ, పురుషుల హాకీ జట్టు కోచ్‌ గ్రాహమ్‌ రీడ్‌తో పాటు స్మిర్నొవ్‌ (షూటింగ్‌) తదితరులు ఉన్నారు. ఈ 32 మంది కోచ్‌ల గడువు ఈ సెప్టెంబర్‌తోనే ముగియనుంది. అయితే ఒలింపిక్స్‌ లక్ష్యాల కోసమే వారిని నియమించారు. కాబట్టి అవి పూర్తికాకుండానే ముగించుకోవడం తగదనే పొడిగింపు ఇచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement