స్పెయిన్‌ గ్రాండ్‌ప్రి విజేత హామిల్టన్‌ | Spain Grand Prix winner Hamilton | Sakshi
Sakshi News home page

స్పెయిన్‌ గ్రాండ్‌ప్రి విజేత హామిల్టన్‌

May 15 2017 12:29 AM | Updated on Sep 5 2017 11:09 AM

స్పెయిన్‌ గ్రాండ్‌ప్రి విజేత హామిల్టన్‌

స్పెయిన్‌ గ్రాండ్‌ప్రి విజేత హామిల్టన్‌

‘పోల్‌ పొజిషన్‌’తో రేసును ప్రారంభించి చివరిదాకా అదే జోరును కొనసాగించిన మెర్సిడెస్‌ జట్టు డ్రైవర్‌ లూయిస్‌ హామిల్టన్‌ ఈ

టాప్‌–5లో ఫోర్స్‌ ఇండియా డ్రైవర్లు

బార్సిలోనా: ‘పోల్‌ పొజిషన్‌’తో రేసును ప్రారంభించి చివరిదాకా అదే జోరును కొనసాగించిన మెర్సిడెస్‌ జట్టు డ్రైవర్‌ లూయిస్‌ హామిల్టన్‌ ఈ సీజన్‌లో రెండో టైటిల్‌ను గెల్చుకున్నాడు. ఆదివారం జరిగిన స్పెయిన్‌ గ్రాండ్‌ప్రి రేసులో హామిల్టన్‌ 66 ల్యాప్‌లను గంటా 35 నిమిషాల 56.497 సెకన్లలో పూర్తి చేసి విజేతగా నిలిచాడు. ఫెరారీ డ్రైవర్‌ సెబాస్టియన్‌ వెటెల్‌ రెండో స్థానంలో, రికియార్డో (రెడ్‌బుల్‌) మూడో స్థానంలో నిలిచారు. భారత్‌కు చెందిన ఫోర్స్‌ ఇండియా జట్టు డ్రైవర్లు సెర్గియో పెరెజ్, ఒకాన్‌ టాప్‌–5లో నిలవడం విశేషం.

పెరెజ్‌కు నాలుగో స్థానం, ఒకాన్‌కు ఐదో స్థానం దక్కింది. మొత్తం 20 మంది డ్రైవర్లు రేసులో పాల్గొనగా నలుగురు మధ్యలోనే వైదొలిగారు. సీజన్‌లోని తదుపరి రేసు మొనాకో గ్రాండ్‌ప్రి ఈనెల 28న జరుగుతుంది. ప్రస్తుతం డ్రైవర్స్‌ చాంపియన్‌షిప్‌ రేసులో వెటెల్‌ (104 పాయింట్లు), హామిల్టన్‌ (98 పాయింట్లు), బొటాస్‌ (మెర్సిడెస్‌–63 పాయింట్లు) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement