పాక్‌తో సిరీస్‌కు సోనోవాల్ మద్దతు | Sonoval to support the series with Pakista | Sakshi
Sakshi News home page

పాక్‌తో సిరీస్‌కు సోనోవాల్ మద్దతు

May 18 2015 1:28 AM | Updated on Sep 3 2017 2:14 AM

భారత్, పాకిస్తాన్ క్రికెట్ సిరీస్‌కు కేంద్ర క్రీడా శాఖ మంత్రి శర్బానంద సోనోవాల్ మద్దతు పలికారు.

కోల్‌కతా : భారత్, పాకిస్తాన్ క్రికెట్ సిరీస్‌కు కేంద్ర క్రీడా శాఖ మంత్రి శర్బానంద సోనోవాల్ మద్దతు పలికారు. ఇరు దేశాల మధ్య క్రీడలు స్నేహ సంబంధాలను పెంపొందిస్తాయని అన్నారు. ‘ఓ క్రీడా మంత్రిగా నా ప్రధాన ఉద్దేశం క్రీడల అభివృద్ధికి తోడ్పటమే. పాక్‌తో సంబంధాలు మరింత మెరుగుపరుచుకునేందుకు ఇరు దేశాల మధ్య క్రికెట్ సిరీస్ జరిగితేనే బావుంటుంది. అయితే పరిష్కారం కావాల్సిన సమస్యలు కూడా ఉన్నాయి’ అని మంత్రి అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement