జాతీయ టీటీ శిబిరానికి స్నేహిత్‌ | snehit to national table tennis camp | Sakshi
Sakshi News home page

జాతీయ టీటీ శిబిరానికి స్నేహిత్‌

Aug 19 2017 10:39 AM | Updated on Sep 17 2017 5:42 PM

జాతీయ టీటీ శిబిరానికి స్నేహిత్‌

జాతీయ టీటీ శిబిరానికి స్నేహిత్‌

తెలంగాణ రాష్ట్ర టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారుడు ఎస్‌ఎఫ్‌ఆర్‌ స్నేహిత్‌ గొప్ప అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు.

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారుడు ఎస్‌ఎఫ్‌ఆర్‌ స్నేహిత్‌ గొప్ప అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు. అతను పాటియాలా లోని జాతీయ క్రీడా శిక్షణా శిబిరానికి ఎంపికయ్యాడు. టేబుల్‌ టెన్నిస్‌ జూనియర్స్‌ కేటగిరీలో భారత నెం.2 ఆటగాడైన స్నేహిత్‌ స్లోవేనియా జూనియర్‌ ఓపెన్‌ టీటీ టోర్నీలో పాల్గొనే భారత జట్టుకు ఎంపికయ్యాడు.

 

ఈ టోర్నీకి సన్నాహకంగా సెప్టెంబర్‌ 17 వరకు పాటియాలాలో నిర్వహించే కోచింగ్‌ క్యాంప్‌నకు అతను హాజరు కానున్నాడు. సెప్టెంబర్‌ 20 నుంచి 24 వరకు స్లోవేనియా జూనియర్‌ ఓపెన్‌ టీటీ టోర్నీ జరుగుతుంది.

 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement