షెర్బో సరసన సిమోన్‌ బైల్స్‌

Simone Biles Ties Record For Most World Gymnastics Championship - Sakshi

వరల్డ్‌ జిమ్నాస్టిక్స్‌ చాంపియన్‌షిప్‌లో 23వ పతకంతో ఆల్‌టైమ్‌ రికార్డు సమం  

స్టుట్‌గార్ట్‌ (జర్మనీ): అమెరికా మెరుపుతీగ సిమోన్‌ బైల్స్‌ ప్రపంచ జిమ్నాస్టిక్స్‌ చాంపియన్‌షిప్‌ చరిత్రలో ఆల్‌టైమ్‌ పతకాల రికార్డును సమం చేసింది. శనివారం జరిగిన వాల్ట్‌ ఈవెంట్‌లో 22 ఏళ్ల బైల్స్‌ 15.399 పాయింట్లతో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. ప్రపంచ చాంపియన్‌షిప్‌ పోటీల చరిత్రలో ఆమెకిది 17వ పసిడి పతకంకాగా ఓవరాల్‌గా 23వ పతకం. ఈ క్రమంలో బెలారస్‌ జిమ్నాస్ట్‌ వితాలీ షెర్బో (23 పతకాలు) పేరిట ఉన్న అత్యధిక పతకాల ఆల్‌టైమ్‌ రికార్డును బైల్స్‌ సమం చేసింది.

షెర్బో 1991 నుంచి 1996 మధ్య జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో 12 స్వర్ణాలు, 7 రజతాలు, 4 కాంస్యాలతో కలిపి మొత్తం 23 పతకాలు గెలిచాడు. శనివారమే జరిగిన అన్‌ఈవెన్‌ బార్స్‌ ఫైనల్లో బైల్స్‌ బరిలోకి దిగినా ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. లేదంటే కొత్త రికార్డు నెలకొల్పేది. అయితే నేడు బ్యాలెన్సింగ్‌ బీమ్, ఫ్లోర్‌ ఎక్సర్‌సైజ్‌ ఫైనల్స్‌లోనూ బైల్స్‌ పోటీపడనుంది. ఈ రెండింటిలో ఆమె ఒక్క పతకం సాధించినా ప్రపంచ చాంపియన్‌íÙప్‌ చరిత్రలో అత్యధిక పతకాలు నెగ్గిన జిమ్నాస్ట్‌గా కొత్త చరిత్ర లిఖిస్తుంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top