చెస్ చాంప్ సిద్ధయ్య | Sidhaiya chess champion | Sakshi
Sakshi News home page

చెస్ చాంప్ సిద్ధయ్య

Dec 27 2013 11:57 PM | Updated on Sep 2 2017 2:01 AM

రాఘవ్స్ ఇంటర్నేషనల్ ఫిడే రేటింగ్ చెస్ టైటిల్‌ను గవి సిద్ధయ్య (తమిళనాడు) కైవసం చేసుకున్నాడు.

ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: రాఘవ్స్ ఇంటర్నేషనల్ ఫిడే రేటింగ్ చెస్ టైటిల్‌ను గవి సిద్ధయ్య (తమిళనాడు) కైవసం చేసుకున్నాడు. కేశవ మెమోరియల్ కాలేజి సర్ధార్ పటేల్ ఆడిటోరియంలో జరిగిన పోటీల్లో గవి సిద్ధయ్య అగ్రస్థానంలో నిలిచి రూ. 25 వేల నగదు బహుమతిని గెలుచుకున్నాడు. సంజయ్ సింధియాకు రెండో స్థానం లభించగా, విశ్వనాథ్ ప్రసాద్ (ఏపీ)కు మూడో స్థానం దక్కింది.
 
 భరత్ కుమార్ రెడ్డి, కె.శ్రీకాంత్(ఏపీ)లకు నాలుగు, ఐదో స్థానం లభించాయి. శుక్రవారం జరిగిన ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన భారత గ్రాండ్ మాస్టర్ ప్రవీణ్ తిప్సే మాట్లాడుతూ దేశంలో చెస్ క్రీడకు హైదరాబాద్ కేంద్రంగా మారిందని  చెప్పారు.    హైదరాబాద్‌లో 1994 నుంచే పలు అంతర్జాతీయ టోర్నీలను నిర్వహిస్తున్నారని తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement