breaking news
chess title
-
విజేత షణ్ముఖ తేజ
సాక్షి, హైదరాబాద్: కేసీఎం ఫిడే రేటింగ్ చెస్ టోర్నమెంట్లో తెలుగు కుర్రాడు షణ్ముఖ తేజ మెరిశాడు. కోయంబత్తూరులో ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో తొమ్మిది రౌండ్లు ముగిసేసరికి 8.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి టైటిల్‌ను దక్కించుకున్నాడు. ఆదివారం జరిగిన చివరి రౌండ్ గేమ్‌లో షణ్ముఖ తేజ (8.5)... వైశాఖ్ (8)తో జరిగిన గేమ్‌ను ‘డ్రా’ చేసుకొని చాంపియన్‌గా నిలిచాడు. అంతకుముందు జరిగిన ఎనిమిది గేముల్లోనూ అతను వరుస విజయాలు సాధించాడు. తొలి గేమ్‌లో మణిని ఓడించిన తేజ... వరుసగా తిరువేంగడమ్, వరదరాజన్, ప్రశాంత్, సుభాశ్ ఆనంద్, రఘుల్, ఆండ్రూ వేద వాట్సన్ సోలోమన్, కిషోర్ దేవ్‌లపై గెలిచాడు. -
చెస్ చాంప్ సిద్ధయ్య
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: రాఘవ్స్ ఇంటర్నేషనల్ ఫిడే రేటింగ్ చెస్ టైటిల్‌ను గవి సిద్ధయ్య (తమిళనాడు) కైవసం చేసుకున్నాడు. కేశవ మెమోరియల్ కాలేజి సర్ధార్ పటేల్ ఆడిటోరియంలో జరిగిన పోటీల్లో గవి సిద్ధయ్య అగ్రస్థానంలో నిలిచి రూ. 25 వేల నగదు బహుమతిని గెలుచుకున్నాడు. సంజయ్ సింధియాకు రెండో స్థానం లభించగా, విశ్వనాథ్ ప్రసాద్ (ఏపీ)కు మూడో స్థానం దక్కింది. భరత్ కుమార్ రెడ్డి, కె.శ్రీకాంత్(ఏపీ)లకు నాలుగు, ఐదో స్థానం లభించాయి. శుక్రవారం జరిగిన ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన భారత గ్రాండ్ మాస్టర్ ప్రవీణ్ తిప్సే మాట్లాడుతూ దేశంలో చెస్ క్రీడకు హైదరాబాద్ కేంద్రంగా మారిందని చెప్పారు. హైదరాబాద్‌లో 1994 నుంచే పలు అంతర్జాతీయ టోర్నీలను నిర్వహిస్తున్నారని తెలిపారు.