ధావన్‌ ఔట్‌

Shikhar Dhawan out of World Cup, Rishabh Pant named replacement - Sakshi

ప్రపంచ కప్‌ నుంచి ఓపెనర్‌ ఇంటిబాట

ఇంకా తగ్గని వేలి గాయం

టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ

అతడి స్థానం రిషభ్‌ పంత్‌తో భర్తీ

సౌతాంప్టన్‌: ఊహించినంతా అయింది. వరుస విజయాలతో ప్రపంచ కప్‌లో జోరు మీదున్న టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. గాయంతో బాధపడుతున్న ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌... టోర్నీ మొత్తానికే దూరమయ్యాడు. బుధవారం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఆస్ట్రేలియాతో ఈ నెల 9న జరిగిన మ్యాచ్‌లో పేసర్‌ కమిన్స్‌ వేసిన బంతి బలంగా తాకడంతో ధావన్‌ ఎడమ బొటన వేలిలో చీలిక వచ్చింది. నొప్పితో బాధపడుతూనే ఆడిన అతడు మ్యాచ్‌లో సెంచరీతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

మున్ముందు జట్టు అవసరాలరీత్యా ధావన్‌ కోలుకునే వరకు చూడాలని మేనేజ్‌మెంట్‌ భావించింది. అందుకని ఓపెనర్‌ మూడు మ్యాచ్‌ల వరకు అందుబాటులో ఉండడని ప్రకటిం చింది. అయితే, తాజా పరిస్థితి ప్రకారం జూలై రెండో వారం వరకు కూడా ధావన్‌ పూర్తి ఫిట్‌నెస్‌ సాధించే అవకాశం లేదని బీసీసీఐ స్పష్టం చేసింది. దీంతో అతడి స్థానాన్ని యువ వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ రిష భ్‌ పంత్‌తో భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ఇప్పటికే స్టాండ్‌బైగా ఎంపిక చేసిన పంత్‌... పాకిస్తాన్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌కు ముందే జట్టుతో చేరాడు.

రోహిత్, కోహ్లిపై భారం
ఫామ్‌లో ఉండీ ప్రతిష్టాత్మక టోర్నీకి అనూహ్యంగా దూరం కావడం వ్యక్తిగతంగా ధావన్‌ను తీవ్రంగా నిరాశకు గురిచేసే అంశమైతే, కీలకమైన అతడి సేవలు కోల్పోవడం కోహ్లి సేనను కలవరపాటుకు గురిచేసేదే. జట్టులో ఏకైక ఎడంచేతి వాటం బ్యాట్స్‌మన్‌ అయిన ధావన్‌కు ఐసీసీ టోర్నీల్లో అద్భుత రికార్డుంది. మొత్తం ఆరు సెంచరీలు (చాంపియన్స్‌ ట్రోఫీలో 3, ప్రపంచ కప్‌లలో 3) బాదాడు. అన్నింటికి మించి ధావన్‌–రోహిత్‌ శర్మ ప్రపంచ అత్యుత్తమ ఓపెనింగ్‌ జోడీ. వీరిద్దరు ఎన్నో చక్కటి ఆరంభాలు ఇచ్చారు. ఒకరు విఫలమైనా మరొకరు రాణిస్తూ... వన్‌డౌన్‌లో వచ్చే కెప్టెన్‌ కోహ్లికి అండగా నిలుస్తున్నారు. కొన్నేళ్లుగా భారత విజయ యాత్రలో ఈ త్రయానిదే ప్రధాన వాటా. ఇప్పుడు ధావన్‌ దూరమవడం కచ్చితంగా ప్రభావం చూపేదే. ఈ నేపథ్యంలో రోహిత్, కోహ్లిపై మరింత భారం పడుతుంది. రెండో ఓపెనర్‌గా రాహుల్‌ ముందు పెద్ద బాధ్యతే ఉంది.   

జట్టు కూర్పుపై ప్రభావం
ధావన్‌ బదులుగా ఎంపిక చేసిన పంత్‌కు తుది జట్టులో చోటు మాత్రంఅనుమానమే. అతడిని తీసుకుంటే నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు పంపాలి. హార్డ్‌ హిట్టర్‌ అయిన పంత్‌... మిడిలార్డర్‌కు తగిన రీతిలో స్ట్రయిక్‌ రొటేట్‌ చేయలేడు. రాహుల్‌పై భరోసా లేకుంటే ఓపెనర్‌గా పంత్‌ను పరీక్షించవచ్చు. అలాగైతే అది పెద్ద ప్రయోగమే అవుతుంది. ఎలాగూ స్కోరు పెంచే ఉద్దేశంలో నంబర్‌–4గా పాండ్యాను పంపుతున్నందున పంత్‌ అవసరం ఎంత అనేది చూడాలి. మరోవైపు పేసర్‌ భువనేశ్వర్‌ కండరాల నొప్పితో బాధపడుతున్న వేళ, బౌలింగ్‌ ప్రత్యామ్నాయంగానూ పనికొచ్చే ఆల్‌రౌండర్‌ విజయ్‌ శంకర్‌ వైపే జట్టు మొగ్గు చూపే వీలుంది. రాబోయే రెండు మ్యాచ్‌లు బలహీన అఫ్గానిస్తాన్, విండీస్‌పైనే కాబట్టి వాటిపై జట్టు కూర్పును పరీక్షించుకుంటే తర్వాత తప్పొప్పులను సరిచేసుకునే వీలుంటుంది.

2019 ప్రపంచ కప్‌లో ఇకపై భాగం కాలేకపోతున్నాననే ప్రకటన చేయడానికి భావోద్వేగానికి గురయ్యా. దురదృష్టవశాత్తు గాయం సమయానికి నయం కావడం లేదు. కానీ, మన జట్టు విజయ పరంపర ముందుకు సాగాలి. జట్టు సభ్యులు, క్రికెట్‌ ప్రేమికులు, భారత దేశం నుంచి దక్కిన ప్రేమ, మద్దతుకు నేను ధన్యుడిని. జై హింద్‌!    
– ట్విట్టర్‌లో శిఖర్‌ ధావన్‌

పంత్‌కు జాక్‌పాట్‌!
సరిగ్గా రెండు నెలల క్రితం రిషభ్‌ పంత్‌ను ప్రపంచ కప్‌ జట్టుకు ఎంపిక చేయకపోవడాన్ని దిగ్గజాలు సహా అందరూ తప్పుబట్టారు. స్వయంగా పంత్‌ తీవ్ర నిరాశ చెందాడు. ఇప్పుడు మాత్రం అదృష్టం అతడిని మరో రూపంలో వరించింది. అన్నింట్లోనూ చోటు దక్కకున్నా పరిస్థితులు కలిసొస్తే కనీసం ఒకటి, రెండు మ్యాచ్‌ల్లోనైనా పంత్‌ తుది జట్టులో ఉండే వీలుంది. తద్వారా ప్రపంచ కప్‌ జట్టు సభ్యుడిగా చిరస్థాయిగా పేరు నిలిచే అవకాశం లభించింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

20-07-2019
Jul 20, 2019, 19:44 IST
కెట్‌ ఆటతో కోట్లకు కోట్లు సంపాదించే ఆటగాళ్లు.. ఇలా కేవలం ట్వీట్లతో సరిపెట్టడం
20-07-2019
Jul 20, 2019, 15:27 IST
ప్రపంచకప్‌ ఫైనల్లో చోటుచేసుకున్న అనూహ్య ఘటనతో ..
19-07-2019
Jul 19, 2019, 15:04 IST
ప్రస్తుత పరిస్థితిపై ఉద్వేగానికి లోనవ్వకుండా స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని
18-07-2019
Jul 18, 2019, 15:42 IST
బౌండరీల ఆధారంగా విజేతను ప్రకటించడం ఓ చెత్త నిర్ణయం
18-07-2019
Jul 18, 2019, 13:21 IST
వన్డే ప్రపంచకప్‌లో ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్‌ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ ఆల్‌రౌండర్‌ జేమ్స్‌ నీషమ్‌ అత్యంత కీలక ఇన్నింగ్స్‌  ఆడుతుండగా..
17-07-2019
Jul 17, 2019, 22:14 IST
లండన్‌ : ప్రపంచకప్‌-2019లో తన విధ్వంసకర ఆటతీరుతో విమర్శకులచే ప్రశంసలు అందుకున్నాడు ఇంగ్లండ్‌ స్టార్‌ ఓపెనర్‌ జేసన్‌ రాయ్‌. అంతేకాకుండా...
17-07-2019
Jul 17, 2019, 19:54 IST
ఫిట్‌నెస్‌ లేదు.. ఫామ్‌ లేదు.. అయినా జట్టులో ఎందుకు ఉంటారో అర్థం కావడం లేదు. వెళ్లిపోవచ్చు కదా!
17-07-2019
Jul 17, 2019, 16:24 IST
లండన్‌: ప్రపంచకప్ ఫైనల్లో చోటు చేసుకున్న ‘బెన్ స్టోక్స్.. ఓవర్‌త్రో’పై పెద్ద చర్చే జరుగుతోంది. ఈ అదనపు పరుగులతోనే ఇంగ్లండ్‌...
17-07-2019
Jul 17, 2019, 13:47 IST
బౌండరీ విధానంతో వన్డే ప్రపంచకప్‌ విజేతను ప్రకటించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతునూ ఉన్నాయి.
17-07-2019
Jul 17, 2019, 12:55 IST
న్యూజిలాండ్‌ క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌పై టీమిండియా ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి ప్రశంసలు కురిపించాడు.
17-07-2019
Jul 17, 2019, 12:33 IST
టీమిండియా క్రికెటర్‌ రోహిత్‌ శర్మ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఇటీవల ముగిసిన ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా...
17-07-2019
Jul 17, 2019, 08:44 IST
ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ‘ఫేస్‌ యాప్‌’  విపరీతంగా ట్రెండ్‌ అవుతోంది. భవిష్యత్తులో, ముఖ్యంగా వృద్ధాప్యంలో వ్యక్తులు ఎలా ఉంటారో ఈ...
17-07-2019
Jul 17, 2019, 07:57 IST
లండన్‌ : సొంతగడ్డపై వన్డే ప్రపంచ కప్‌ను గెలుచుకున్న ఇంగ్లండ్‌ విజయ సంబరాలు కొనసాగుతూనే ఉన్నాయి. తొలిసారి తమ దేశానికి...
17-07-2019
Jul 17, 2019, 02:47 IST
వెల్లింగ్టన్‌: ప్రపంచ కప్‌ ఫైనల్లో ఫలితాన్ని తేల్చిన తీరుపై న్యూజిలాండ్‌ వైపు నుంచి స్పందనలు కొనసాగుతూనే ఉన్నాయి. జట్టు కెప్టెన్‌...
16-07-2019
Jul 16, 2019, 15:42 IST
లండన్‌: వరల్డ్‌కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ ఆఖరి ఓవర్‌లో ఓవర్‌ త్రో అయిన బంతికి ఇంగ్లండ్‌కు ఆరు పరగులు కాకుండా ఐదు...
16-07-2019
Jul 16, 2019, 14:28 IST
ఓవర్‌ త్రో వివాదంపై మాట్లాడటానికి అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ)
16-07-2019
Jul 16, 2019, 14:07 IST
న్యూఢిల్లీ: క్రికెటర్ల ప్రదర్శన ఆధారంగా తమ అత్యుత్తమ జట్టును ప్రకటించడం దిగ్గజ క్రికెటర్ల ఆనవాయితీ.  వరల్డ్‌కప్‌కు ముందు పలువురు దిగ్గజ...
16-07-2019
Jul 16, 2019, 13:20 IST
న్యూఢిల్లీ: వరల్డ్‌కప్‌ వంటి మెగా టోర్నీలో అందులోనూ విజేతను ప్రకటించే క్రమంలో ‘బౌండరీ రూల్‌’ ను పాటించడంపై బాలీవుడ్‌ మెగాస్టార్‌...
16-07-2019
Jul 16, 2019, 11:35 IST
లండన్‌: అత్యంత నాటకీయ పరిణామాల మధ్య జరిగిన వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ చాంపియన్‌గా నిలిచింది. ఆద్యంతం ఉత్కంఠం...
16-07-2019
Jul 16, 2019, 10:51 IST
లండన్‌: వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్లో న్యూజిలాండ్‌ కప్‌ అంచుల వరకూ వెళ్లి చతికిలబడటం వెనుక ఆ జట్టు ఆటగాళ్ల తప్పిదాలు...
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top