షమీ భార్య అసహనం..మీడియాపై దాడి

Shamis wife Hasin Jahan assaults media personnel in Kolkata - Sakshi

కోల్‌కతా: తన భర్త మహ్మద్‌ షమీపై చేసిన సంచలన ఆరోపణల తర్వాత తరచు వార్తల్లో నిలుస్తున్న హసీన్‌ జహాన్‌..తాజాగా మీడియాపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తనకు విలేకర్ల నుంచి ఎదురవుతున్న పలు ప్రశ్నల నేపథ్యంలో జహాన్‌ అతిగా ప్రవర్తించారు. ఈ మేరకు నగరంలోని సెయింట్‌ సెబాస్టియన్స్‌ స్కూల్‌ ఆవరణలో జర్నలిస్టులు ఆమెను వీడియో చిత్రీకరించే క్రమంలో కెమెరా లాక్కోని పగలగొట్టారు. అదే సమయంలో గట్టిగా అరుస్తూ తన కారులో వెళ్లిపోయారు. గత కొన్ని రోజులుగా మీడియా ముందుకొచ్చి కూల్‌గా సమాధానాలిచ్చిన జహాన్‌.. ఈ రోజు మాత్రం సహనం కోల్పోయి ప్రవర్తించడం చర‍్చనీయాంశమైంది.

ఇదిలా ఉంచితే, తనకు అండగా నిలుస్తున్న స్నేహితులకు షమీ ధన్యవాదాలు తెలియజేశాడు. ' కష్ట సమయాన్ని ఎదుర్కొంటున్న సమయంలో అండగా నిలిచిన వారికీ కృతజ్ఞతలు' అంటూ షమీ ట్వీట్‌ చేశాడు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top