కరేబీయన్‌ లీగ్‌లో కింగ్‌ ఖాన్‌ చిందులు!

Shah Rukh Khan Dancing with Caribbean Cheerleaders - Sakshi

పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌ : కరేబీయన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌ సందడి చేశారు. శుక్రవారం జమైకా తలవాస్‌తో జరగిన మ్యాచ్‌కు షారుఖ్‌ హాజరై తన జట్టు ట్రిన్‌బాగో నైట్‌ రైడర్స్‌(టీకేఆర్‌)కు మద్దతు తెలిపాడు. ఇక మ్యాచ్‌కు ముందు చీర్‌ గర్ల్స్‌తో కలిసి మైదానంలో చిందేశాడు. దీనికి సంబంధించిన వీడియోను సీపీఎల్‌ తమ అధికారిక ట్విటర్‌ షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది. ఇక షారుఖ్‌ ఉత్సాహాన్ని జమైకా తలవాస్‌ సారథి ఆండ్రూ రస్సెల్‌ ఆవిరి చేశాడు. భారీ లక్ష్యం నిర్దేశించిన తమ జట్టు గెలుస్తుందని భావించిన షారుఖ్‌కు నిరాశే ఎదురైంది. రస్సెల్‌ ఆల్‌రౌండ్‌ షోతో షారుఖ్‌ టీమ్‌ 4 వికెట్ల తేడాతో ఓడింది. ఇక ఐపీఎల్‌లో రస్సెల్‌ షారుఖ్‌ జట్టు కోల్‌కతా నైటరైడర్స్‌ అన్న విషయం తెలిసిందే.

టీకేఆర్‌ ప్రమోషనల్‌ సాంగ్‌..
ఇక తమ జట్టు ప్రచార సాంగ్‌ను బ్రావో తన ట్విటర్‌ వేదికగా విడుదల చేశారు. టీకేఆర్‌ ప్రమోషన్‌ సాంగ్‌ను విడుదల చేస్తున్నానని, ఫ్రాంచైజీ యజమాని షారుఖ్‌ ఖాన్‌కు ధన్యవాదాలంటూ బ్రావో ట్విట్‌ చేశాడు. ఇక ఈ ప్రమోషన్‌ సాంగ్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. (చదవండి: ఆండ్రూ రస్సెల్‌ అద్భుత రికార్డు!)

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top