బొటాస్‌కు ‘అబుదాబి’ టైటిల్‌ | Serene Valtteri Bottas beats Lewis Hamilton at the Abu Dhabi Grand Prix | Sakshi
Sakshi News home page

బొటాస్‌కు ‘అబుదాబి’ టైటిల్‌

Nov 27 2017 12:48 AM | Updated on Aug 1 2018 4:17 PM

Serene Valtteri Bottas beats Lewis Hamilton at the Abu Dhabi Grand Prix - Sakshi

అబుదాబి: ఫార్ములావన్‌ సీజన్‌ చివరి రేసు అబుదాబి గ్రాండ్‌ప్రిలో మెర్సిడెస్‌ జట్టు డ్రైవర్‌ వాల్తెరి బొటాస్‌ విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన ఈ రేసులో నిర్ణీత 55 ల్యాప్‌లను బొటాస్‌ గంటా 34 నిమిషాల 14.062 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని సంపాదించాడు. ‘పోల్‌ పొజిషన్‌’తో రేసును ఆరంభించిన బొటాస్‌ ఆద్యంతం ఆధిపత్యం చలాయించి రేసును ముగించాడు. హామిల్టన్‌ (మెర్సిడెస్‌) రెండో స్థానంలో, వెటెల్‌ (ఫెరారీ) మూడో స్థానంలో నిలిచారు.

 భారత్‌కు చెందిన ఫోర్స్‌ ఇండియా డ్రైవర్లు సెర్గియో పెరెజ్‌ ఏడో స్థానంలో, ఎస్తెబన్‌ ఒకాన్‌ ఎనిమిదో స్థానంలో నిలిచారు. నిర్ణీత 20 రేసులు ముగిశాక హామిల్టన్‌ 363 పాయింట్లతో ప్రపంచ డ్రైవర్స్‌ చాంపియన్‌షిప్‌ టైటిల్‌ సొంతం చేసుకోగా... 317 పాయింట్లతో వెటెల్‌ రన్నరప్‌గా... 305 పాయింట్లతో బొటాస్‌ మూడో స్థానంలో నిలిచారు. 668 పాయింట్లతో మెర్సిడెస్‌ జట్టు ప్రపంచ కన్‌స్ట్రక్టర్స్‌ చాంపియన్‌షిప్‌ టైటిల్‌ను సాధించగా... 187 పాయింట్లతో ఫోర్స్‌ ఇండియా నాలుగో స్థానంలో నిలిచింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement