ఎన్బీఏలో తొలి భారతీయుడికి స్థానం


న్యూఢిల్లీ: పంజాబ్కు చెందిన సత్నం సింగ్ భామర అరుదైన ఘనత సాధించాడు. అమెరికాలో ప్రాచుర్యమైన ఎన్బీఏలో స్థానం సంపాదించిన తొలి భారతీయుడిగా సత్నం రికార్డు సృష్టించాడు. డల్లాస్ మావెరిక్స్ టీమ్లో సత్నంను తీసుకున్నారు. ఏడు అడుగులకుపైగా ఎత్తు ఉన్న సత్నం పంజాబ్లోని బర్నాలకు చెందినవాడు.2011లో ఆసియా బాస్కెట్బాల్ చాంపియన్షిప్లో సత్నం భారత్కు ప్రాతినిధ్యం వహించాడు. భారత్ జట్టు తరపున ఆడిన పిన్నవయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు.  గత ఐదేళ్లుగా సత్నం అమెరికాలోని ఫ్లోరిడాలో శిక్షణ తీసుకుంటున్నాడు. ఎన్బీఏలో ఇంతకుముందు భారత సంతతి వ్యక్తి సిమ్ భుల్లర్ ఆడాడు.   కాగా భుల్లర్ కెనడాలో జన్మించాడు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top