తైక్వాండోలో సారాఖాన్‌కు స్వర్ణం | sara khan gets gold in taekwondo championship | Sakshi
Sakshi News home page

తైక్వాండోలో సారాఖాన్‌కు స్వర్ణం

Jan 4 2018 10:33 AM | Updated on Jan 4 2018 10:33 AM

sara khan gets gold in taekwondo championship - Sakshi

సారాఖాన్‌ను అభినందిస్తున్న ఎమ్మెల్యే వెంకటేశ్వర్‌రెడ్డి


సాక్షి, హైదరాబాద్‌: జాతీయ జూనియర్‌ తైక్వాండో చాంపియన్‌షిప్‌లో రాష్ట్రానికి చెందిన మసీరా సారా ఖాన్‌ మెరిసింది. ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఈ టోర్నీలో సారా పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. మహిళల 63–68 వెయిట్‌ కేటగిరీలో ఆమె విజేతగా నిలిచింది. ఈ విజయంతో ఆమె అంతర్జాతీయ తైక్వాండో చాంపియన్‌షిప్‌కు ఎంపికైంది. ఈ సందర్భంగా జాతీయ స్థాయిలో రాణించిన సారా ఖాన్‌ను బుధవారం శాట్స్‌ చైర్మన్‌ ఎ. వెంకటేశ్వర్‌ రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వర్‌ రెడ్డి అభినందించారు. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించి రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆకాంక్షించారు.

తెలంగాణ ఖాతాలో 9 పతకాలు...


జాతీయ స్కూల్‌ గేమ్స్‌ తైక్వాండో చాంపియన్‌షిప్‌లో తెలంగాణ రాష్ట్ర బృందం ఆకట్టుకుంది. నల్లగొండలో జరిగిన ఈ టోర్నీలో 3 రజతాలు, 6 కాంస్యాలతో కలిపి మొత్తం 9 పతకాలను సాధించింది. నందీశ్వర్‌ (21–23కేజీలు), హన్షిక సింగ్‌ (24–26 కేజీలు), హిమాన్షు (50 కేజీలు) ముగ్గురూ రన్నరప్‌లుగా నిలిచి రజతాలను సాధించారు. శివ కిరణ్‌ (25–27 కేజీలు), నైనా బాయి (18–20 కేజీలు), రమ్య (22–24 కేజీలు), త్రిలోక్‌ (32 కేజీలు), అక్షిత (38 కేజీలు), సంతోష్‌ (అండర్‌–18కేజీలు) కాంస్యాలను గెలుచుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement