క్వార్టర్స్‌లో సానియా జంట | Sania Mirza moves into Miami Open quarters | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో సానియా జంట

Mar 29 2017 2:53 AM | Updated on Sep 5 2017 7:20 AM

క్వార్టర్స్‌లో సానియా జంట

క్వార్టర్స్‌లో సానియా జంట

మయామి ఓపెన్‌ డబ్ల్యూటీఏ ప్రీమియర్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో సానియా మీర్జా (భారత్‌)–బార్బరా స్ట్రికోవా (చెక్‌ రిపబ్లిక్‌) జంట క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించింది.

మయామి ఓపెన్‌ డబ్ల్యూటీఏ ప్రీమియర్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో సానియా మీర్జా (భారత్‌)–బార్బరా స్ట్రికోవా (చెక్‌ రిపబ్లిక్‌) జంట క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. మహిళల డబుల్స్‌ రెండో రౌండ్‌లో సానియా–స్ట్రికోవా ద్వయం 1–6, 6–1, 10–4తో ‘సూపర్‌ టైబ్రేక్‌’లో తిమియా బాబోస్‌ (హంగేరి)–అనస్తాసియా పావ్లీచెంకోవా (రష్యా) జోడీపై గెలిచింది.

గంటపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రెండు జోడీలు తమ సర్వీస్‌లను మూడేసి సార్లు కోల్పోయాయి. అయితే సూపర్‌ టైబ్రేక్‌లో సానియా–స్ట్రికోవా జంట పైచేయి సాధించి విజయాన్ని ఖాయం చేసుకుంది. క్వార్టర్‌ ఫైనల్లో వానియా కింగ్‌ (అమెరికా)–ష్వెదోవా (కజకిస్తాన్‌)లతో సానియా–స్ట్రికోవా తలపడతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement