సానియాకు 18వ డబుల్స్ టైటిల్ | sania mirza 18th doubles title | Sakshi
Sakshi News home page

సానియాకు 18వ డబుల్స్ టైటిల్

Sep 29 2013 1:05 AM | Updated on Sep 1 2017 11:08 PM

సానియాకు 18వ డబుల్స్ టైటిల్

సానియాకు 18వ డబుల్స్ టైటిల్

సింగిల్స్ విభాగంలో కెరీర్ దాదాపు ముగిసినా... డబుల్స్‌లో మాత్రం భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా నిలకడగా రాణిస్తోంది.

టోక్యో : సింగిల్స్ విభాగంలో కెరీర్ దాదాపు ముగిసినా... డబుల్స్‌లో మాత్రం భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా నిలకడగా రాణిస్తోంది. జింబాబ్వే క్రీడాకారిణి కారా బ్లాక్‌తో కలిసి ఈ హైదరాబాద్ అమ్మాయి పాన్ పసిఫిక్ ఓపెన్‌లో డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. శనివారం ముగిసిన ఈ టోర్నమెంట్ ఫైనల్లో అన్‌సీడెడ్ సానియా మీర్జా-కారా బ్లాక్ ద్వయం 4-6, 6-0, 11-9తో హావో చింగ్ చాన్ (చైనీస్ తైపీ)-లీజెల్ హుబెర్ (అమెరికా) జంటను ఓడించింది.
 
 ఈ ఏడాది సానియాకిది నాలుగో డబుల్స్ టైటిల్ కాగా... కెరీర్‌లో 18వ టైటిల్ కావడం విశేషం. 85 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సానియా జంట నాలుగు ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసింది. సానియా జోడికి లక్షా 22 వేల డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 76 లక్షల 24 వేలు)తోపాటు 900 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
 

Advertisement
 
Advertisement
Advertisement