ఫైనల్లో సామియా | samiya enters final of asia badminton championship | Sakshi
Sakshi News home page

ఫైనల్లో సామియా

Oct 8 2017 10:15 AM | Updated on Oct 8 2017 10:15 AM

samiya enters final of asia badminton championship

సాక్షి, హైదరాబాద్‌: ఆసియా జూనియర్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న హైదరాబాద్‌ అమ్మాయి సామియా ఇమాద్‌ ఫారూఖి అండర్‌–15 బాలికల సింగిల్స్‌ విభాగంలో ఫైనల్లోకి దూసుకెళ్లింది. మయన్మార్‌లోని యాంగూన్‌లో శనివారం జరిగిన సెమీఫైనల్లో మూడో సీడ్‌ సామియా 21–9, 21–18తో భారత్‌కే చెందిన ఆషి రావత్‌ను ఓడించింది. ఆదివారం జరిగే ఫైనల్లో విద్‌జాజా స్టెఫానీ (ఇండోనేసియా)తో సామియా తలపడుతుంది.

ఇదే టోర్నీ అండర్‌–17 బాలికల డబుల్స్‌ సెమీఫైనల్లో మోపాటి కెయూర–సెల్వం కవిప్రియ (భారత్‌) జంట 13–21, 19–21తో కెల్లీ లారిసా–షెలాండ్రీ వియోలా (ఇండోనేసియా) జోడీ చేతిలో ఓడిపోయింది. అండర్‌–15 బాలుర డబుల్స్‌ సెమీఫైనల్లో ఆయూష్‌ రాజ్‌ గుప్తా–శుభమ్‌ పటేల్‌ (భారత్‌) జంట 19–21, 17–21తో రజీఫ్‌–జెన్‌ యి ఓంగ్‌ (మలేసియా) జోడీ చేతిలో ఓడిపోయింది. సెమీస్‌లో ఓటమితో ఆషి రావత్, కెయూర–కవిప్రియ, ఆయూష్‌–శుభమ్‌ కాంస్య పతకాలు ఖాయం చేసుకున్నారు.  

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement