ఒక‍్కటైన జహీర్‌-సాగరిక | Sagarika Ghatge ties the knot with Zaheer Khan | Sakshi
Sakshi News home page

ఒక‍్కటైన జహీర్‌-సాగరిక

Nov 23 2017 1:30 PM | Updated on Nov 23 2017 1:31 PM

Sagarika Ghatge ties the knot with Zaheer Khan - Sakshi - Sakshi

ముంబై: టీమిండియా మాజీ పేసర్‌ జహీర్‌ ఖాన్ ఇంటివాడయ్యాడు. తన ప్రేయసి, బాలీవుడ్‌ నటి సాగరిక ఘట్గేను జహీర​ వివాహం చేసుకున్నాడు. గురువారం ఉదయం జహీర్‌-సాగరికలు రిజస్టర్‌ వివాహం చేసుకున‍్నారు. ఈ పెళ్ళి ఫొటోల‌ను జ‌హీర్ స్నేహితురాలు, స్పోర్ట్ ఫిట్‌నెస్ స్టూడియో మార్కెటింగ్ హెడ్ అంజ‌నా శ‌ర్మ  షేర్ చేశారు.

నవంబర్ 27న ముంబైలోని తాజ్ మ‌హ‌ల్ ప్యాలెస్ అండ్ ట‌వ‌ర్‌లో వీరి వివాహ రిసెప్ష‌న్ జ‌ర‌గనుంది. ఈ కార్యక‍్రమానికి బాలీవుడ్‌ సెలబ్రెటిలతో పాటు, జహీర్‌ ఖాన్‌ స్నేహితులు హాజరుకానున్నారు.  వివాహ రిసెప్ష‌న్‌కి సంబంధించిన ఆహ్వాన‌ప‌త్రిక‌ను సాగ‌రిక స్నేహితురాలు, చ‌క్ దే ఇండియాలో ఆమె స‌హ‌న‌టి విద్యా మాల్వంక‌ర్ షేర్ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement