సచిన్ చేతిలో ఈ పాప ఎవరు?
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌కు చిన్న పిల్లలంటే చాలా ఇష్టం. ఇంకా ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అంటే కూడా ఇష్టం. ఈ రెండూ కలిసొస్తే ఇక చెప్పేదేముంది?
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌కు చిన్న పిల్లలంటే చాలా ఇష్టం. ఇంకా ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అంటే కూడా ఇష్టం. ఈ రెండూ కలిసొస్తే ఇక చెప్పేదేముంది? సరిగ్గా ఇదే జరిగింది. ముంబై ఇండియన్స్ జట్టు ఫొటో షూట్ సందర్భంగా హర్భజన్ సింగ్ తన కూతురు హినాయా హీర్‌ను కూడా తీసుకొచ్చాడు. ఆ జట్టుకు మెంటర్ అయిన సచిన్ టెండూల్కర్ ఆ చిన్నారిని చూసి ముచ్చట పడ్డాడు. వెంటనే తీసుకుని ఎత్తుకుని ముద్దాడాడు. ఆ పాప కూడా సచిన్‌తో బాగా తెలిసున్న మనిషిలా ఆటలు ఆడుకుంది. అది చూసి సచిన్ మరింత ముచ్చటపడ్డాడు.
వెంటనే ఆ ముచ్చటను అక్కడున్న ఫొటోగ్రాఫర్లు తమ కెమెరాల్లో బంధించారు. ఆ ఫొటోను టెండూల్కర్ తన ట్విట్టర్‌లో కూడా పోస్ట్ చేశారు. ఇది చిన్నారి హినాయా హీర్‌తో ఉన్న ఫొటో అని, ఆమె ఆనందాల హరివిల్లని కామెంట్ పెట్టారు. వెంటనే దాన్ని హర్భజన్ సింగ్ కూడా రీట్వీట్ చేశాడు. హర్భజన్ భార్య గీతా బస్రా గత సంవత్సరం జూలై 28వ తేదీన పాపకు జన్మనిచ్చింది. గీతా బస్రా సైతం తన కూతురితో సచిన్ ఉన్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.
