అతను మ్యాజిక్ చేస్తాడని తెలుసు: సచిన్ | Sakshi
Sakshi News home page

అతను మ్యాజిక్ చేస్తాడని తెలుసు: సచిన్

Published Tue, May 23 2017 3:33 PM

అతను మ్యాజిక్ చేస్తాడని తెలుసు: సచిన్

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10 టైటిల్ ను ముంబై ఇండియన్స్ పోరాడి గెలిచిన సంగతి తెలిసిందే. ఆదివారం రైజింగ్ పుణె సూపర్ జెయింట్ తో ఫైనల్లో ముంబై ఇండియన్స్ 130 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకుని విజయం సాధించింది. ఒకనొక దశలో 71/1 తో పటిష్టంగా కనిపించిన రైజింగ్ పుణెను ముంబై కట్టడి చేసి టైటిల్ ను ఎగురేసుకుపోయింది. ఈ టైటిల్ సాధించడంలో ముంబై ఇండియన్స్ పేసర్లు ప్రధాన పాత్ర పోషించారు. జస్ప్రిత్ బూమ్రా, లసిత్ మలింగా, మిచెల్ జాన్సన్ లు తమ బాధ్యతను సమర్ధవంతంగా నిర్వర్తించి పుణెకు గట్టి షాక్ తగిలింది.

ప్రధానంగా చివరి మూడు ఓవర్లలో పుణె 30 పరుగులు చేయాల్సిన తరుణంలో మలింగాకు బంతి ఇచ్చాడు రోహిత్ శర్మ.  ఆ ఓవర్లో అప్పటికే క్రీజ్ లో కుదురుకున్న స్టీవ్ స్మిత్ బంతిని హిట్ చేయడానికి యత్నించినా సఫలం కాలేదు. ఆ ఓవర్ లో మలింగా యార్కర్లతో హడలెత్తించడంతో కేవలం ఏడు పరుగులే వచ్చాయి. దాంతో చివరి రెండు ఓవర్లలో విజయానికి 23 పరుగులు అవసరమయ్యాయి. . అయితే మలింగా ప్రదర్శనపై మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు.

'ముంబై జట్టులో మలింగా పాత్ర వెలకట్టలేనిది. గత కొన్నేళ్లుగా మలింగా అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. కీలక ఫైనల్లో మలింగా మ్యాజిక్ చేస్తాడని నేను ముందే బలంగా నమ్మా. ఒక ఓవర్ లో పూర్తిగా పరిస్థితుల్ని మార్చేసి శక్తి మలింగాకు ఉంది. ఆ అంచనాల్ని అందుకుని ముంబై టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు'అని సచిన్ తెలిపాడు. మరొకవైపు జట్టు విజయంలో కోచ్ మహేలా జయవర్ధనే పాత్రను సచిన్ గుర్తు చేశాడు. ఓ మోస్తరు లక్ష్యాన్ని మాత్రమే ప్రత్యర్థికి నిర్దేశించిన తరుణంలో జయవర్ధనే ఆటగాళ్లలో ధైర్యం నింపిన తీరు అమోఘం అన్నాడు. ఎట్టిపరిస్థితుల్లోనూ నమ్మకం కోల్పోకుండా ఉంటే విజయం వరిస్తుందని చెప్పడంతో పాటు ఒకసారి చాంపియన్ ఎప్పుడూ చాంపియన్ అనేది గుర్తించుకుని పోరాడాలంటూ జయవర్దనే ఆటగాళ్లకు దిశానిర్దేశం చేసిన విధానం చాలా బాగుందని సచిన్ తెలిపాడు.

Advertisement

తప్పక చదవండి

Advertisement