సచిన్, సెహ్వాగ్ మళ్లీ కలిసి... | Sachin And Sehwag And Lara Set To Feature In T20 Tournament | Sakshi
Sakshi News home page

సచిన్, సెహ్వాగ్ మళ్లీ కలిసి...

Oct 18 2019 3:34 AM | Updated on Oct 18 2019 3:34 AM

Sachin And Sehwag And Lara Set To Feature In T20 Tournament - Sakshi

ముంబై: క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన మాజీలతో కొత్త లీగ్‌ నిర్వహణకు రంగం సిద్ధమైంది. రోడ్‌ సేఫ్టీ వరల్డ్‌ సిరీస్‌ టి20 లీగ్‌ పేరుతో ఈ టోర్నీ జరుగుతుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 2 నుంచి 16 వరకు ఈ టోర్నీ ముంబై, పుణే వేదికగా జరుగుతుంది. ఈ టోర్నీ వివరాలను గురువారం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సచిన్‌ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, బ్రియాన్‌ లారా, తిలక రత్నే దిల్షాన్, బ్రెట్‌ లీ, జాంటీ రోడ్స్‌ పాల్గొన్నారు. లీగ్‌కు దిగ్గజ బ్యాట్స్‌మన్‌ సునీల్‌ గావస్కర్‌ కమిషనర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇండియా లెజెండ్స్, ఆ్రస్టేలియా లెజెండ్స్, దక్షణాఫ్రికా లెజెండ్స్, శ్రీలంక లెజెండ్స్, వెస్టిండీస్‌ లెజెండ్స్‌ జట్లు ఇందులో పాల్గొంటున్నాయి. దాదాపు 75 మంది రిటైర్డ్‌ క్రికెటర్లు ఇందులో ఆడనున్నట్లు సమాచారం. ఈ లీగ్‌లో 10 మ్యాచ్‌లు జరుగుతాయి.

మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య ఫైనల్‌ పోరు జరుగుతుంది. భారత్‌కు సచిన్‌ టెండూల్కర్‌ నాయకత్వం వహిస్తుండగా... జట్టులో వీరేంద్ర సెహ్వాగ్, జహీర్‌ ఖాన్‌లు ఆడనున్నారు. విండీస్‌కు బ్రియాన్‌ లారా, దక్షిణాఫ్రికాకు జాంటీ రోడ్స్, శ్రీలంకకు దిల్షాన్, ఆ్రస్టేలియాకు బ్రెట్‌ లీ కెపె్టన్‌లుగా ఉండబోతున్నారు. వీరితో పాటు దక్షిణాఫ్రికా దిగ్గజ ఆల్‌రౌండర్‌ జాక్వస్‌ కలిస్, ఆ్రస్టేలియా రిటైర్డ్‌ ప్లేయర్లు బ్రాడ్‌ హాగ్, సైమండ్స్‌ పాల్గొంటున్నారు. ఈ లీగ్‌ ద్వారా వచ్చిన ఆదాయంలో కొంత భాగాన్ని రోడ్డు భద్రత అవగాహన కోసం పని చేస్తున్న ‘శాంత్‌ భారత్‌ సురక్షిత్‌ భారత్‌’ అనే  సంస్థకు విరాళంగా ఇవ్వనున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement