రన్నరప్ ఆంధ్రప్రదేశ్ | Runner-up Andhra Pradesh in weight lifting championship | Sakshi
Sakshi News home page

రన్నరప్ ఆంధ్రప్రదేశ్

Dec 30 2013 1:50 AM | Updated on Sep 2 2017 2:05 AM

రన్నరప్ ట్రోఫీతో ఆంధ్రప్రదేశ్ వెయిట్‌లిఫ్టర్ల బృందం

రన్నరప్ ట్రోఫీతో ఆంధ్రప్రదేశ్ వెయిట్‌లిఫ్టర్ల బృందం

జాతీయ జూనియర్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ పురుషుల జట్టు సత్తా చాటింది. ఈ టోర్నీ ఓవరాల్ టీమ్ చాంపియన్‌షిప్ విభాగంలో ఏపీ రన్నరప్‌గా నిలిచింది.

గువహటి: జాతీయ జూనియర్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ పురుషుల జట్టు సత్తా చాటింది. ఈ టోర్నీ ఓవరాల్ టీమ్ చాంపియన్‌షిప్ విభాగంలో ఏపీ రన్నరప్‌గా నిలిచింది.
 
  మహారాష్ట్రకు అగ్ర స్థానం దక్కగా... 2 స్వర్ణాలు, 2 రజతాలు, 4 కాంస్యాలు సాధించిన ఆంధ్రప్రదేశ్ రెండో స్థానం దక్కించుకుంది. ఆదివారం ఇక్కడ జరిగిన 105 కేజీల కేటగిరీ ఈవెంట్‌లో ఆంధ్రప్రదేశ్ లిఫ్టర్ ఎంఆర్ చైతన్య రెండు స్వర్ణాలు గెలుచుకున్నాడు. క్లీన్ అండ్ జర్క్‌లో 164 కిలోల బరువు ఎత్తి స్వర్ణం సాధించిన అతను ఓవరాల్ ఫలితంతో (288 కేజీలు) మరో స్వర్ణాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. స్నాచ్‌లో మాత్రం 124 కిలోల బరువు ఎత్తిన చైతన్యకు ఐదో స్థానం దక్కింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement