'విరాట్ తరువాత అతడే బెస్ట్' | Rohit Sharma is one of the top T20 batsmen after Virat Kohli, says Robin Singh | Sakshi
Sakshi News home page

'విరాట్ తరువాత అతడే బెస్ట్'

Apr 29 2016 6:02 PM | Updated on Sep 3 2017 11:03 PM

'విరాట్ తరువాత అతడే బెస్ట్'

'విరాట్ తరువాత అతడే బెస్ట్'

ఐపీఎల్లో కోల్ కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఘన విజయంలో కీలక పాత్ర పోషించిన కెప్టెన్ రోహిత్ శర్మపై ఆ జట్టు అసిస్టెంట్ కోచ్ రాబిన్ సింగ్ ప్రశంసలు కురిపించాడు.

ముంబై: ఐపీఎల్లో కోల్ కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఘన విజయంలో కీలక పాత్ర పోషించిన కెప్టెన్ రోహిత్ శర్మపై ఆ జట్టు అసిస్టెంట్ కోచ్ రాబిన్ సింగ్ ప్రశంసలు కురిపించాడు. టీ 20 ఫార్మాట్ లో తనదైన ముద్రతో చెలరేగిపోతున్న రోహిత్.. ఈ ఫార్మాట్ కు అతికినట్లు సరిపోయే ఆటగాడని కొనియాడాడు. ఈ ఫార్మాట్ లో టాప్ ఆటగాళ్లలో రోహిత్ కూడా ఒకడన్నాడు. టీ 20ల్లో భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి తరువాత స్థానం రోహిత్ శర్మదేనని రాబిన్ తెలిపాడు.


'అన్ని ఫార్మాట్లలో రోహిత్ శర్మ పూర్తి స్థాయి సక్సెస్ సాధించలేకపోవచ్చు. ప్రత్యేకంగా టెస్టు క్రికెట్ కు, పొట్టి ఫార్మాట్ కు చాలా వ్యత్యాసం ఉంటుఉంది. టీ 20 ఫార్మాట్ టాప్ ఆటగాళ్ల జాబితాలో స్టార్ ఆటగాడు విరాట్ తరువాత స్థానం కచ్చితంగా రోహిత్ శర్మదే'అని రాబిన్ పొగడ్తల్లో ముంచెత్తాడు.ఒంటి చేత్తో మ్యాచ్ ఫలితం మార్చేసే సత్తా ఉన్న ఆటగాళ్లలో పొలార్డ్ ఒకడని, అతడు గాడిలో పడడం తమ టీమ్‌కు అనుకూలించే అంశమని చెప్పాడు. తనదైన రోజున అతడిని ఆపడం ప్రత్యర్థుల తరం కాదని వ్యాఖ్యానించాడు.

గురువారం జరిగిన మ్యాచ్లో పొలార్డ్ 17 బంతుల్లో 2 ఫోర్లు,6 సిక్సర్ల సాయంతో 51 పరుగులు చేసి ముంబైకు అద్భుతమైన విజయాన్ని అందించిన సంగతి తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement