రోహిత్ శర్మ అర్ధసెంచరీ | rohit sharma half century in colombo test | Sakshi
Sakshi News home page

రోహిత్ శర్మ అర్ధసెంచరీ

Aug 31 2015 12:27 PM | Updated on Sep 3 2017 8:29 AM

శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ లో భారత్ నాలుగో రోజు లంచ్ విరామానికి 5 వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది.

కొలంబో: శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ లో భారత్ నాలుగో రోజు లంచ్ విరామానికి 5 వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది. దీంతో లంకపై టీమిండియాకు 243 పరుగుల ఆధిక్యం దక్కింది. 21/3 ఓవర్ నైట్ స్కోరుతో ఆట ప్రారంభించిన కోహ్లి సేన ఆచితూచి ఆడింది.

కెప్టెన్ కోహ్లి(21) తొందగానే అవుటైనా స్టువర్ట్ బిన్నీతో కలిసి రోహిత్ శర్మ పోరాడాడు. రోహిత్ అర్ధ సెంచరీ చేశాడు. 72 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్ తో 50 పరుగులు చేసి అవుటయ్యాడు. టెస్టుల్లో అతడికిది 4వ హాఫ్ సెంచరీ. బిన్నీ 38, ఓజా 11 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement