సెమీస్‌లో ఓడిన బోపన్న జంట | Rohan Bopanna-Denis Shapovalov Bow Out After Losing in Semi-finals | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో ఓడిన బోపన్న జంట

Aug 12 2019 5:42 AM | Updated on Aug 12 2019 5:42 AM

Rohan Bopanna-Denis Shapovalov Bow Out After Losing in Semi-finals - Sakshi

న్యూఢిల్లీ: మాంట్రియల్‌ ఓపెన్‌ ఏటీపీ మాస్టర్స్‌–1000 టెన్నిస్‌ టోర్నమెంట్‌లో అన్‌సీడెడ్‌ రోహన్‌ బోపన్న (భారత్‌)–డెనిస్‌ షపోవలోవ్‌ (కెనడా) జంట పోరాటం ముగిసింది. కెనడాలో ఆదివారం జరిగిన పురుషుల డబు ల్స్‌ సెమీఫైనల్లో బోపన్న–షపోవలోవ్‌ ద్వ యం 6–7 (3/7), 6–7 (7/9)తో రాబిన్‌ హాస్‌–వెస్లీ కూలాఫ్‌ (నెదర్లాండ్స్‌) జోడీ చేతి లో ఓడిపోయింది. గంటా 36 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న జంట నాలుగు ఏస్‌లు సంధించింది. రెండుసార్లు ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్‌ చేసి, తమ సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయింది. సెమీస్‌లో ఓడిన బోపన్న జంటకు 76,300 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 54 లక్షల 11 వేలు)తోపాటు 360 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement