విజేత రిసాలా బజార్‌ జట్టు | risala bazar team won volleyball title | Sakshi
Sakshi News home page

విజేత రిసాలా బజార్‌ జట్టు

Dec 26 2017 10:48 AM | Updated on Dec 26 2017 10:48 AM

risala bazar team won volleyball title - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అటల్‌ బిహారి వాజ్‌పేయ్‌ యూత్‌ ఫెస్ట్‌లో భాగంగా జరిగిన వాలీబాల్‌ చాంపియన్‌షిప్‌లో రిసాలా బజార్‌ జట్టు ఆకట్టుకుంది. ఎల్బీ స్టేడియంలో రెండు రోజుల పాటు జరిగిన ఈ టోర్నీలో చాంపియన్‌గా నిలిచింది. టైటిల్‌పోరులో రిసాలా బజార్‌ 25–20, 25–21తో ఎల్బీ స్టేడియంపై గెలుపొందింది. అంతకుముందు జరిగిన సెమీస్‌ మ్యాచ్‌ల్లో ఎల్బీ స్టేడియం 25–18, 25–21తో వైఎంసీఏ నారాయణగూడపై, రిసాలా బజార్‌ 25–16, 25–18తో సరూర్‌నగర్‌పై విజయం సాధించాయి.

ఫైనల్‌ అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో సికింద్రాబాద్‌ ఎంపీ బండారు దత్తాత్రేయ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, ఉప్పల్‌ ఎమ్మెల్యే ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement