ఐసీసీ మ్యాచ్ రిఫరీ ప్యానెల్‌లో రిచర్డ్‌సన్ | Richardson, the ICC match referee panel | Sakshi
Sakshi News home page

ఐసీసీ మ్యాచ్ రిఫరీ ప్యానెల్‌లో రిచర్డ్‌సన్

Sep 22 2015 12:07 AM | Updated on Sep 3 2017 9:44 AM

వెస్టిండీస్ మాజీ కెప్టెన్ రిచీ రిచర్డ్‌సన్ ఇక మ్యాచ్ రిఫరీగా మారనున్నారు. గతవారం శ్రీలంకకు చెందిన రోషన్ మహానామా

దుబాయ్ : వెస్టిండీస్ మాజీ కెప్టెన్ రిచీ రిచర్డ్‌సన్ ఇక మ్యాచ్ రిఫరీగా మారనున్నారు. గతవారం శ్రీలంకకు చెందిన రోషన్ మహానామా వైదొలగడంతో ఆయన స్థానంలో   ఐసీసీ మ్యాచ్ రిఫరీల ఎలైట్ ప్యానెల్‌లో రిచర్డ్‌సన్‌ను చేర్చారు. ప్రస్తుతం విండీస్ జట్టు మేనేజర్‌గా ఉన్న ఆయన ఒప్పందం ప్రకారం వచ్చే ఏడాది జనవరి 3 వరకు విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఆ తర్వాతే రిఫరీగా బాధ్యతలు తీసుకుంటారని ఐసీసీ పేర్కొంది. ఈ ప్యానెల్‌లో ఉండే ఏడుగురు రిఫరీల్లో భారత్ నుంచి మాజీ పేసర్ శ్రీనాథ్ కూడా ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement