breaking news
ICC match referee
-
నాకు ఫోన్ చేసి మరీ..: బీసీసీఐ, టీమిండియాపై సంచలన ఆరోపణలు
ఇంగ్లండ్ మాజీ క్రికెటర్, ఐసీసీ మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్ (Chris Broad) టీమిండియాపై సంచలన ఆరోపణలు చేశాడు. పలు మ్యాచ్‌లలో భారత జట్టు చేసిన తప్పులను కప్పి పుచ్చాలంటూ తనకు ఫోన్లు వచ్చాయని.. రాజకీయ జోక్యం వల్లే ఒత్తిళ్లు పెరిగాయని ఆరోపించాడు.కాగా ఇంగ్లండ్ దిగ్గజ పేసర్లలో ఒకడైన స్టువర్ట్ బ్రాడ్ (Stuard Broad) తండ్రే క్రిస్ బ్రాడ్. ఇంగ్లండ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. 25 టెస్టుల్లో 1661, 34 వన్డేల్లో 1361 పరుగులు చేశాడు. అనంతరం 2003- 2024 వరకు ఐసీసీ మ్యాచ్ రిఫరీగా పనిచేశాడు క్రిస్ బ్రాడ్.కాంట్రాక్టును పునరుద్ధరించని ఐసీసీమొత్తంగా 123 టెస్టులు, 361 వన్డేలు, 138 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లకు బ్రాడ్ రిఫరీగా పనిచేశాడు. అయితే, ఇంకొన్నాళ్లు కొనసాగాలని చూసినా ఐసీసీ అతడి కాంట్రాక్టును పునరుద్ధరించలేదు.ఇదిలా ఉంటే.. తాజాగా ‘ది టెలిగ్రాఫ్‌నకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బ్రాడ్ మాట్లాడుతూ.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI), టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ (Sourav Ganguly)పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఆనాటి మ్యాచ్‌లో నిర్ణీత ఓవర్ల కంటే ఇండియా మూడు, నాలుగు ఓవర్లు వెనుకబడి ఉంది.అక్కడ ఉంది టీమిండియాజరిమానా పడే పరిస్థితి నెలకొంది. ఇంతలో నాకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. ‘ఉదారంగా వ్యవహరించండి. ఎందుకంటే అక్కడ ఉంది టీమిండియా’ అని నాకు సందేశం వచ్చింది. సరే మరేం పర్లేదు అనుకున్నా.గంగూలీ నా మాట లెక్కచేయలేదుతగినంత సమయం దొరకడంతో చెప్పినట్లే చేశాం. అయితే, ఆ తర్వాతి మ్యాచ్‌లోనూ ఇదే పునరావృతమైంది. స్లో ఓవర్ రేటు నివారించేలా చర్యలు తీసుకోవాలని సౌరవ్ గంగూలీకి చెప్పినా అతడు నా మాట లెక్కచేయలేదు.అంతలో మళ్లీ ఫోన్.. ‘నన్ను ఇప్పుడు ఏం చేయమంటారు?’ అని అడిగాను. ఇందుకు బదులుగా.. ‘అతడు (గంగూలీ) ఏం చేస్తే అదే చేయనివ్వండి’ అనే సమాధానం వచ్చింది. అంతా రాజకీయం. అప్పటి నుంచే క్రీడల్లో రాజకీయ జోక్యం మొదలైంది. ఇంకా నయం నేను ఇంకా ఆ పదవిలో లేను.కానీ 20 ఏళ్ల పాటు నాపైకి ఎన్నో ‘బుల్లెట్లు’ దూసుకువచ్చాయి. రాజకీయ జోక్యం వల్ల సమస్యలు వచ్చాయి. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే.. ‘20 ఏళ్ల సుదీర్ఘ సమయం. ఎలా తట్టుకున్నానో అనిపిస్తుంది’’ అని క్రిస్ బ్రాడ్ ఆరోపణలు చేశాడు. అయితే, టీమిండియా ఆడిన ఏ మ్యాచ్ విషయంలో తాను ఇలాంటి ఒత్తిళ్లకు గురయ్యానన్నది మాత్రం అతడు స్పష్టంగా చెప్పలేదు.అందుకే ఆరోపణలా?కాగా ఐసీసీ తన కాంట్రాక్టును పునరుద్ధరించకపోవడాన్ని దృష్టిలో పెట్టుకునే బ్రాడ్ ఇలాంటి వ్యాఖ్యలు చేశాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఐసీసీ ప్రస్తుత చైర్మన్‌గా.. బీసీసీఐ మాజీ కార్యదర్శి జై షా ఉన్న విషయం తెలిసిందే.చదవండి: క్రికెట్ ఒక్కటే జీవితం కాదు.. కోహ్లి నన్ను బాగా అర్థం చేసుకుంటాడు: రోహిత్ శర్మ -
ఆంధ్రప్రదేశ్ మూలాలున్న ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కన్నుమూత
ఇంగ్లండ్ మాజీ క్రికెటర్, ఐసీసీ మాజీ రిఫరీ రామన్ సుబ్బా రో 92 ఏళ్ల వయసులో కన్నుమూశారు. వయసు పైబడటం, దీర్ఘకాలిక అనారోగ్య కారణాల చేత సుబ్బా రో మృతి చెందినట్లు తెలుస్తుంది. భారత మూలాలున్న సుబ్బా రో ఇంగ్లండ్ జాతీయ జట్టు తరఫున 1958-61 మధ్యలో 13 టెస్ట్‌లు ఆడి 46.85 సగటున 984 పరుగులు చేశాడు. సుబ్బా రో ఫస్ట్‌క్లాస్ కెరీర్లో సర్రే, నార్తంప్టన్ఫైర్ కౌంటీల తరఫున 260 మ్యాచ్‌లు ఆడి 14182 పరుగులు చేశాడు. ఇందులో 30 శతకాలు, 73 అర్దశతకాలు ఉన్నాయి. సుబ్బా రో కెరీర్ అత్యధిక స్కోర్ 300 పరుగులుగా ఉంది. పార్ట్ టైమ్ లెగ్ స్పిన్ బౌలర్ కూడా అయిన సుబ్బా రో ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 87 వికెట్లు తీశాడు. 1981 భారత్, శ్రీలంక పర్యటనల్లో సుబ్బా రో ఇంగ్లండ్ క్రికెట్ జట్టు మేనేజర్‌గా వ్యవహరించాడు. 1985-1990 మధ్యలో సుబ్బా రో ఇంగ్లండ్ టెస్ట్ మరియు కౌంటీ క్రికెట్ బోర్డును చైర్మన్‌గా వ్యవహరించాడు. రామన్ సుబ్బా రో మృతి పట్ల ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు, ఐసీసీ సంతాపం తెలిపాయి. ఈసీబీ, ఐసీసీలకు సుబ్బా రో చేసిన సేవలు ఎనలేనివని కొనియాడాయి. కాగా, రామన్ సుబ్బా రో తండ్రి పంగులూరి వెంకట సుబ్బారావు ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్లకు చెందిన వాడు. సుబా రో తల్లి డోరిస్ మిల్డ్రెడ్ పిన్నర్ బ్రిటన్ మహిళ. పంగులూరి వెంకట సుబ్బారావు ఉన్నత చదువుల కోసం లండన్‌కు వెళ్లగా అక్కడ డోరిస్ మిల్డ్రెడ్ పిన్నర్‌తో పరిచయం ఏర్పడింది. వీరిద్దరి పరిచయం ప్రేమగా మారి, పెళ్లికి దారి తీసింది. వీరిద్దరి సంతానమే రామన్ సుబ్బా రో. -
స్లో ఓవర్ రేట్.. టీమిండియాకు పడింది దెబ్బ
భాగ్యనగరం వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో విజయంతో ఉత్సాహంలో ఉన్న టీమిండియాకు బిగ్‌షాక్ తగిలింది. టీమిండియాకు స్లో ఓవర్ రేట్ దెబ్బ పడింది. నిర్ణీత సమయం ముగిసేలోగా రోహిత్ సేన మూడు ఓవర్లు తక్కువగా వేసినట్లు తేలడంతో మ్యాచ్ ఫీజులో 60 శాతం కోత విధించినట్లు ఐసీసీ మ్యాచ్ రిఫరీ జగవల్ శ్రీనాథ్ తెలిపారు. ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద ఆర్టికల్ 2.22 ప్రకారం మ్యాచ్ నిర్ణీత సమయం ముగిసేలోగా టీమిండియా మూడు ఓవర్లు తక్కువ వేసినట్లు తేలడంతో స్లో ఓవర్ రేట్గా పరిగణించినట్లు తెలిపారు. మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ నమోదు చేసినందుకు టీమిండియా ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో మూడు ఓవర్ల చొప్పున ఒక్కో ఓవర్‌కు 20 శాతం కింద మ్యాచ్ ఫీజులో 60 శాతం కోత విధించినట్లు ఐసీసీ పేర్కొంది. కాగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన తప్పును అంగీకరించినట్లు వెల్లడించింది. దీంతో విచారణ అవసరం లేదని ఐసీసీ తెలిపింది. ఇక మ్యాచ్‌లో టీమిండియా 12 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. భాగ్యనగరం వేదికగా జరిగిన వన్డే మ్యాచ్‌లో బ్యాటర్లు పండుగ చేసుకున్నారు. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా శుబ్‌మన్ గిల్ డబుల్ సెంచరీతో మెరవడంతో 8 వికెట్ల నష్టానికి 349 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ మైకెల్ బ్రాస్‌వెల్ మెరుపు శతకంతో రాణించి టీమిండియాను వణికించాడు. అయితే లోకల్ బాయ్ సిరాజ్ చివర్లో అద్భుతంగా బౌలింగ్ చేయడంతో న్యూజిలాండ్ 337 పరుగులకు ఆలౌటైంది. సిరాజ్‌కు నాలుగు వికెట్లు దక్కాయి. ఇక ఇరుజట్ల మధ్య రెండో వన్డే రాయ్‌పూర్ వేదికగా శనివారం(జనవరి 21న) జరగనుంది. చదవండి: రెండో వన్డేలోనూ ఉమ్రాన్‌కు నో ఛాన్స్! ఒకవేళ ఆడించినా.. -
ఐసీసీ మ్యాచ్ రిఫరీ ప్యానెల్లో రిచర్డ్సన్
దుబాయ్ : వెస్టిండీస్ మాజీ కెప్టెన్ రిచీ రిచర్డ్సన్ ఇక మ్యాచ్ రిఫరీగా మారనున్నారు. గతవారం శ్రీలంకకు చెందిన రోషన్ మహానామా వైదొలగడంతో ఆయన స్థానంలో ఐసీసీ మ్యాచ్ రిఫరీల ఎలైట్ ప్యానెల్లో రిచర్డ్సన్ను చేర్చారు. ప్రస్తుతం విండీస్ జట్టు మేనేజర్‌గా ఉన్న ఆయన ఒప్పందం ప్రకారం వచ్చే ఏడాది జనవరి 3 వరకు విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఆ తర్వాతే రిఫరీగా బాధ్యతలు తీసుకుంటారని ఐసీసీ పేర్కొంది. ఈ ప్యానెల్లో ఉండే ఏడుగురు రిఫరీల్లో భారత్ నుంచి మాజీ పేసర్ శ్రీనాథ్ కూడా ఉన్నారు.


