ట్రోఫీతో ఈడెన్‌కు తిరిగొస్తాం.. | Return to Eden with the trophy | Sakshi
Sakshi News home page

ట్రోఫీతో ఈడెన్‌కు తిరిగొస్తాం..

May 14 2017 10:50 PM | Updated on Sep 5 2017 11:09 AM

ట్రోఫీతో ఈడెన్‌కు తిరిగొస్తాం..

ట్రోఫీతో ఈడెన్‌కు తిరిగొస్తాం..

ఈ ఏడాది ఐపీఎల్‌ సీజన్‌లో తమ జట్టు కోల్‌కతా నైట్‌రైడర్స్‌ విజేతగా నిలుస్తుందని, ట్రోఫీతో ఈడెన్‌ గార్డెన్‌కి తిరిగొస్తామని జట్టు

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ యజమాని షారూక్‌

కోల్‌కతా: ఈ ఏడాది ఐపీఎల్‌ సీజన్‌లో తమ జట్టు కోల్‌కతా నైట్‌రైడర్స్‌ విజేతగా నిలుస్తుందని, ట్రోఫీతో ఈడెన్‌ గార్డెన్‌కి తిరిగొస్తామని జట్టు యజమాని షారూక్‌ ఖాన్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. షూటింగ్‌ షెడ్యూల్‌ వల్ల తాజా సీజన్‌ మ్యాచ్‌లకు హాజరుకాలేకపోయిన షారూక్, శనివారం కోల్‌కతా–ముంబై జట్ల మధ్య కోల్‌కతాలో జరిగిన మ్యాచ్‌ను మాత్రం తిలకించాడు. అయితే ఈ మ్యాచ్‌లో కోల్‌కతా జట్టు తొమ్మిది పరుగుల తేడాతో ఓడిపోయింది. ‘ప్రతి మ్యాచ్‌లోనూ మాకు అభిమానుల మద్దతు లభిస్తోంది.

మా శక్తిమేర కృషి చేసి ట్రోఫీ గెలుచుకునేందుకు ప్రయత్నిస్తాం. కొన్ని మ్యాచుల్లో గెలుపు వరకూ వెళ్లి ఓడిపోయాం. రాబోయే మూడు కీలక మ్యాచుల్ని (ఎలిమినేటర్, ప్లే ఆఫ్, ఫైనల్‌) గెలిచి విజేతలుగా నిలుస్తాం. కోల్‌కతాలో ముంబైతో జరిగిన మ్యాచే చివరిది. ఈ సీజన్‌లో మళ్లీ ఇక్కడ ఆడే అవకాశం లేదు. కానీ మేం ట్రోఫీతో ఈడెన్‌ గార్డెన్‌కు తిరిగొస్తాం. జట్టు గెలుపు, ఓటముల్లో కోల్‌కతా అభిమానులు మాకెప్పుడూ అండగానే ఉన్నారు.’ అని షారూక్‌ అన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement