'ఐపీఎల్.. మాకు ప్లే ఆఫ్ చాన్స్ కష్టమే' | Reaching play offs is not possible for Bangalore, says Yuzvendra Chahal | Sakshi
Sakshi News home page

'ఐపీఎల్.. మాకు ప్లే ఆఫ్ చాన్స్ కష్టమే'

May 14 2016 12:16 PM | Updated on Aug 21 2018 2:28 PM

'ఐపీఎల్.. మాకు ప్లే ఆఫ్ చాన్స్ కష్టమే' - Sakshi

'ఐపీఎల్.. మాకు ప్లే ఆఫ్ చాన్స్ కష్టమే'

బీకర్ బ్యాటింగ్ లైనప్ ఉన్న ఐపీఎల్ జట్లలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఒకటని చెప్పవచ్చు.

బెంగళూరు: బీకర్ బ్యాటింగ్ లైనప్ ఉన్న ఐపీఎల్ జట్లలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఒకటని చెప్పవచ్చు. అయితే ఇప్పటివరకూ 10 మ్యాచ్ లు ఆడిన ఆ జట్టు కేవలం నాలుగు విజయాలతో ఆరో స్థానంలో ఉంది. టీమ్ ప్రస్తుత పరిస్థితి గురించి బెంగళూరు ఆటగాడు యుజువేంద్ర చాహల్ కొన్ని విషయాలు చెప్పాడు. తమ తదుపరి నాలుగు మ్యాచుల్లోనూ విజయం సాధిస్తేనే ప్లే ఆఫ్స్ కు వెళ్లే 4 జట్లలో తమ జట్టుకు స్థానం ఉంటుందన్నాడు. అయితే ప్లే ఆఫ్స్ పై మాకు ఇంకా ఆశలున్నాయని ధీమా వ్యక్తం చేయడం కాస్త ఆసక్తికరంగా మారింది.

ఇక మిగిలిన నాలుగు లీగ్ మ్యాచులలో ఒక్కటి ఓడినా ఇంటి బాట పట్టడం ఖాయమని చెబుతున్నాడు. జట్టు సమిష్టిగా రాణిస్తే రాయల్‌ చాలెంజర్స్ కు అసాధ్యమంటే ఏదీ లేదని ప్లే ఆప్స్ అవకాశాలపై బెంగళూరు లెగ్ స్పిన్నర్ చాహల్ అభిప్రాయపడ్డాడు. టీమ్ ప్రస్తుతం ఒత్తిడిలో ఉన్న విషయాన్ని అంగీకరించాడు. అయితే టీ20లలో ఏ ఒక్కరో ఆడితే నెగ్గుకురావడం కష్టమని, సమిష్టిగా మంచి ఇన్నింగ్స్ లు వస్తేనే విజయాలు సాధ్యమన్నాడు. కప్పు నెగ్గాలన్న బెంగళూరు టీమ్ కల గత ఎనిమిది సీజన్లుగా కలగానే మిగిలిపోయింది. బెంగళూరు స్థానిక చిన్నస్వామి స్డేడియంలో గుజరాత్ లయన్స్ తో నేటి సాయంత్రం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement