ఇక్బాల్ అబ్దుల్లాను దక్కించుకున్న ఆర్ సీబీ | RCB acquire Abdulla in IPL trading window | Sakshi
Sakshi News home page

ఇక్బాల్ అబ్దుల్లాను దక్కించుకున్న ఆర్ సీబీ

Nov 21 2014 1:51 PM | Updated on Sep 2 2017 4:52 PM

ఇక్బాల్ అబ్దుల్లాను దక్కించుకున్న ఆర్ సీబీ

ఇక్బాల్ అబ్దుల్లాను దక్కించుకున్న ఆర్ సీబీ

రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు ఇక్బాల్ అబ్దుల్లాను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్ సీబీ) దక్కించుకుంది.

న్యూఢిల్లీ: రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు ఇక్బాల్ అబ్దుల్లాను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్ సీబీ) దక్కించుకుంది. ఐపీఎల్ ట్రేడింగ్ విండో ద్వారా అతడిని కొనుగోలు చేసిందని బీసీసీఐ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. 2015 ఎడిషన్ కోసం మొదటి 'ట్రేడింగ్ విండో' అక్టోబర్ 6న తెరిచారు. దీని గడువు డిసెంబర్ 12తో ముగుస్తుంది. దీని ద్వారా క్రీడాకారులను దక్కించుకునే వీలుంది.

'ట్రేడింగ్ విండో' ద్వారా ఇద్దరు ఆటగాళ్లను ఇంతకుముందు ముంబై ఇండియన్స్ జట్టు దక్కించుకుంది. రాజస్థాన్ రాయల్స్ నుంచి ఉన్ముక్త్ చంద్, కోల్కతా నైట్ రైడర్స్ నుంచి ఆర్. వినయ్ కుమార్ ను కొనుగోలు చేసింది. తమ టీమ్ నుంచి ప్రవీణ్ కుమార్, మైఖేల్ హస్సీని రిలీజ్ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement