ట్రైనింగ్ సెషన్లో గాయపడిన అశ్విన్ | Ravichandran Ashwin leaves training session after sustaining hand injury | Sakshi
Sakshi News home page

ట్రైనింగ్ సెషన్లో గాయపడిన అశ్విన్

Jul 4 2016 2:18 PM | Updated on Sep 4 2017 4:07 AM

ట్రైనింగ్ సెషన్లో గాయపడిన అశ్విన్

ట్రైనింగ్ సెషన్లో గాయపడిన అశ్విన్

వెస్టిండీస్ పర్యటనకు వెళ్లే ముందు టీమిండియాకు ప్రతికూలత ఎదురైంది. భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ గాయపడ్డాడు.

బెంగళూరు: వెస్టిండీస్ పర్యటనకు వెళ్లే ముందు టీమిండియాకు ప్రతికూలత ఎదురైంది. భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ గాయపడ్డాడు. బెంగళూరు జాతీయ క్రికెట్ అకాడమీలో నిర్వహించిన భారత క్రికెట్ శిక్షణ శిబిరంలో చివరి రోజు అశ్విన్  చేతికి గాయమైంది.

చీఫ్ కోచ్ అనిల్ కుంబ్లే పర్యవేక్షణలో భారత టెస్టు జట్టు క్రికెటర్లు ప్రాక్టీస్ చేశారు. ట్రైనింగ్ సెషన్లో అశ్విన్ కుడిచేతికి బంతి తగలడంతో గాయపడినట్టు క్రికెట్ వర్గాలు తెలిపాయి. దీంతో అతను ట్రైనింగ్ సెషన్ నుంచి వైదొలిగాడు. వెస్టిండీస్ పర్యటనలో టీమిండియా తరపున కీలక పాత్ర పోషిస్తాడని భావిస్తున్న అశ్విన్ గాయపడటం ఆందోళన కలిగించే విషయం. ఈ నెల 21 నుంచి వెస్టిండీస్లో జరిగే నాలుగు టెస్టుల సిరీస్లో టీమిండియా ఆడనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement